గుండెలో నదులు నింపుకొని (మొదటి భాగం)
గుండెలో నదులు
నింపుకొని
(వచన
కవితల సంపుటి)
రావి రంగారావు

రావి రంగారావు సాహిత్య
పీఠం
గుంటూరు 522034
Gundelo nadulu nimpukoni…
(free verse poems)
By
RAVI RANGARAO
M.A., M.Ed., M.Phil., Ph.D., DDE., DDL., SLET.,
(Retd Principal, Andhra Jatheeya College of Edn, Machilipatnam)
Ravirangarao.blogspot.in
9247581825
Whatsapp 9493686165
Publisher
RAVI
RANGARAO SAAHITHYA PEETHAM, GUNTUR
522034
FIRST PRINT : JANUARY 2018
PRICE : Rs.100
All rights are reserved with the poet
For
copies:
NARRA PRABHAVATHI
101 Sankha
Chakra Nivas,
Annapurna
Nagar 5th Line East,
Gorantla,
Guntur
-522034
కవి
ఆత్మాభిమానాన్ని
తలగుడ్డ/కిరీటంగా
శిరసున వహించుకొని...
తలగుడ్డ/కిరీటంగా
శిరసున వహించుకొని...
లోక శుభ
కాంక్ష
నాగలి / ఆయుధంగా
ఒక చేతిలో పట్టుకొని...
నాగలి / ఆయుధంగా
ఒక చేతిలో పట్టుకొని...
అభయ
మిస్తూ
పంట / పువ్వు
మరో చేతిలో పెట్టుకొని...
పంట / పువ్వు
మరో చేతిలో పెట్టుకొని...
మానవుల
గుండెల్లో / గుడులలో
పవిత్ర స్థానం సంపాదించుకొని...
గుండెల్లో / గుడులలో
పవిత్ర స్థానం సంపాదించుకొని...
ప్రతి
కవి
ఒక రైతు,
ఒక దేవుడు...
ఒక రైతు,
ఒక దేవుడు...
కాకుంటే
రెండు పోలికలకు ఒక తేడా...
రెండు పోలికలకు ఒక తేడా...
దేవుడు
నిదరపోతుంటాడు,
రైతు మాత్రం
ఎల్లప్పుడూ మేలుకొనే వుంటాడు.
నిదరపోతుంటాడు,
రైతు మాత్రం
ఎల్లప్పుడూ మేలుకొనే వుంటాడు.
ఏదైనా ఎక్కడైనా కదలాలి
చెట్టులానే
మోడునూ అభిమానించాలి
గాయపడి ఎండిపోయి
నీ ఇంటికి స్తంభ మయింది...
మోడునూ అభిమానించాలి
గాయపడి ఎండిపోయి
నీ ఇంటికి స్తంభ మయింది...
కొండలానే
రాయినీ గౌరవించాలి
ముక్కలుముక్కలై తెగిపడి
నీ ఇంటికి గోడయింది...
రాయినీ గౌరవించాలి
ముక్కలుముక్కలై తెగిపడి
నీ ఇంటికి గోడయింది...
నదిలానే
నీటిబొట్టునూ పూజించాలి
దారీ తెన్నూ వదిలి
నీ కుండలో ప్రాణ మయింది...
నీటిబొట్టునూ పూజించాలి
దారీ తెన్నూ వదిలి
నీ కుండలో ప్రాణ మయింది...
చరాచర
సృష్టిలో ఏదైనా
కదలాలి,
కదిలేది ఎదగటానికే!
ఎదిగేది ఒదగటానికే!
ఒదిగేది
పదికాలాలు బతకటానికే!
కదలాలి,
కదిలేది ఎదగటానికే!
ఎదిగేది ఒదగటానికే!
ఒదిగేది
పదికాలాలు బతకటానికే!
కసి
తీర్చుకునే దేవుడు
పాపుల మీద
ప్రతీకారం తీర్చుకుంటున్నాడు దేవుడు...
ప్రతీకారం తీర్చుకుంటున్నాడు దేవుడు...
చెట్టుగా పుట్టిస్తే
నొప్పి తెలియకుండా బతుకుతాడేమో,
పక్షిగా పుట్టిస్తే
స్వేచ్ఛగా సాగిపోతాడేమో,
జంతువుగా పుట్టిస్తే
రోగా లొచ్చినా మందుల్లేకుండా బతికిపోతాడేమో...
నొప్పి తెలియకుండా బతుకుతాడేమో,
పక్షిగా పుట్టిస్తే
స్వేచ్ఛగా సాగిపోతాడేమో,
జంతువుగా పుట్టిస్తే
రోగా లొచ్చినా మందుల్లేకుండా బతికిపోతాడేమో...
ఈ జీవి ఎన్ని పాపాలు చేసిందో!
అందుకే కసిగా మనిషిగా పుట్టించి
కసి తీర్చుకున్నాడు దేవుడు...
అందుకే కసిగా మనిషిగా పుట్టించి
కసి తీర్చుకున్నాడు దేవుడు...
ఇప్పు
డిక మనిషి
అన్నిటినీ అడుక్కుంటున్నాడు,
అపకీర్తి మూటకట్టుకుంటున్నాడు,
నొప్పి పుడితే రోతగా ఏడుస్తున్నాడు,
రోగాలొస్తే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూలబడుతున్నాడు,
చదువుకొని బాగుపడదా మనుకుంటే
హైటెక్ విద్యాలయాల పాలబడుతున్నాడు...
అన్నిటినీ అడుక్కుంటున్నాడు,
అపకీర్తి మూటకట్టుకుంటున్నాడు,
నొప్పి పుడితే రోతగా ఏడుస్తున్నాడు,
రోగాలొస్తే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూలబడుతున్నాడు,
చదువుకొని బాగుపడదా మనుకుంటే
హైటెక్ విద్యాలయాల పాలబడుతున్నాడు...
దేవుడు చాలా తెలివైన పాలకుడు,
పాపుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
పాపుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
ఇంటాయన గమనించాలి
ఇల్లు
చూడగానే ఇల్లాలు కాదు-
ఇంటాయనే నాకు గుర్తు కొస్తాడు...
ఇంటాయనే నాకు గుర్తు కొస్తాడు...
పూసే మొక్క లున్న నివాసం
ముచ్చట గొలిపే దరహాసం...
ముచ్చట గొలిపే దరహాసం...
ఫల తరువు లున్న ఇల్లు
పరమానందాల హరివిల్లు...
పరమానందాల హరివిల్లు...
నాల్గు
దిక్కుల జాగా భవనం
నవ నవ పరిమళ ఉద్యానవనం...
నవ నవ పరిమళ ఉద్యానవనం...
నీరింకే
నేల ఉన్న మేడ
కాలే మండుటెండల్లో చల్లని నీడ...
కాలే మండుటెండల్లో చల్లని నీడ...
మరో
ముఖ్య విషయం-
నీ ఇంటికోసం
నీది కాని స్థలం
అంగుళం లాగేసుకున్నా మోసం,
ఈశాన్యం పెరిగితే మంచిదని
సెంటీమీటర్ ఆక్రమించినా
మహా మహా వాస్తు దోషం...
వ్రతం చేసినా సరే,
హోమం చేయించినా సరే...
తీర్థాలు క్షేత్రాలు తిరిగినా సరే
దేవుడికి కిరీటాలు చేయించినా సరే...
నీ ఇంటికోసం
నీది కాని స్థలం
అంగుళం లాగేసుకున్నా మోసం,
ఈశాన్యం పెరిగితే మంచిదని
సెంటీమీటర్ ఆక్రమించినా
మహా మహా వాస్తు దోషం...
వ్రతం చేసినా సరే,
హోమం చేయించినా సరే...
తీర్థాలు క్షేత్రాలు తిరిగినా సరే
దేవుడికి కిరీటాలు చేయించినా సరే...
ఢిల్లీ
దీపావళికి స్వాగతం
నీ బిడ్డ లంటే
నీకు ఇష్టం గదా,
మనవళ్ళు మనవరాళ్లంటే
ఇంకా మురుసుకుంటావు గదా,
మరి భవిష్యత్తులో ఆ మనవళ్ళ బిడ్డలు
వాళ్ళ బిడ్డల బిడ్డల బిడ్డల బిడ్డల బిడ్డలు...
అంతా సుఖంగా బతకాలని
కడుపు నిండా కోరుకుంటావు గదా...
నీకు ఇష్టం గదా,
మనవళ్ళు మనవరాళ్లంటే
ఇంకా మురుసుకుంటావు గదా,
మరి భవిష్యత్తులో ఆ మనవళ్ళ బిడ్డలు
వాళ్ళ బిడ్డల బిడ్డల బిడ్డల బిడ్డల బిడ్డలు...
అంతా సుఖంగా బతకాలని
కడుపు నిండా కోరుకుంటావు గదా...
హృదయ కోశాల అండ వాయువు- బండ కాకుండా,
నరాల్ని పరవశింపజేసే రాగాలు- రోగాలు కాకుండా,
మెదడుకు నిలయం జలం- ప్రళయ గరళం కాకుండా...
నరాల్ని పరవశింపజేసే రాగాలు- రోగాలు కాకుండా,
మెదడుకు నిలయం జలం- ప్రళయ గరళం కాకుండా...
నీ కోసం చెబుతున్నా!
నీ ప్రేమించే నీ తరాలకోసం చెబుతున్నా!
మీరు పొద్దున్నే చేసుకునే
మీ మతం కూరలో మందు కలుపుకోవద్దు,
మీరు రోజూ తినే
మీ రాజకీయ ఆహారంలో యాసిడ్ పోసుకోవద్దు,
వ్యసనంగా విలాసంగా ఫాన్సీగా
వాయు ధ్వని జల కాలుష్యాల్ని పెంచకండి, ద్వేషించండి...
బాణసంచా కాల్చకుండా ఢిల్లీ దీపావళి సూత్రం పాటించండి, జీవించండి.
వాయు ధ్వని జల కాలుష్యాల్ని పెంచకండి, ద్వేషించండి...
బాణసంచా కాల్చకుండా ఢిల్లీ దీపావళి సూత్రం పాటించండి, జీవించండి.
పార్టీ
జెండాలు
ఇంటి
మీద జండా
ఇంట్లో కనీసం ఒక గూండా
ఇంట్లో కనీసం ఒక గూండా
చెట్టు
మీద జండా
పక్షులకు పోగొట్టింది అండ
పక్షులకు పోగొట్టింది అండ
గుడి
మీద జండా
భక్తి నెత్తిన బండ
భక్తి నెత్తిన బండ
బడి
మీద జండా
సరస్వతిని పీకేస్తుంది కండ
సరస్వతిని పీకేస్తుంది కండ
ఇపుడు
పార్టీ జెండా లంటే
మంటల ఎజెండాలు...
మీకు మోజెక్కు వైతే గుండెల్లో పెట్టుకోండి
పచ్చని వ్యవసాయం తల్లిని
ప్రాణంగా కాపాడుకోండి...
మంటల ఎజెండాలు...
మీకు మోజెక్కు వైతే గుండెల్లో పెట్టుకోండి
పచ్చని వ్యవసాయం తల్లిని
ప్రాణంగా కాపాడుకోండి...
ఊరిలో
పార్టీ జెండాలు
పల్లె తండ్రికి
అరదండాలు.
పార్టీ జెండాలు
పల్లె తండ్రికి
అరదండాలు.
చదువు
దొంగలు
ఇంట్లో
దొంగలు పడ్డారు
బంగారం డబ్బులు పట్టుకెళ్ళారు
కేసు పెట్టాను...
బంగారం డబ్బులు పట్టుకెళ్ళారు
కేసు పెట్టాను...
పట్టపగలే
కత్తులు బాంబులతో
దాడి చేసి హత్య చేశారు
కేసు పెట్టాను...
దాడి చేసి హత్య చేశారు
కేసు పెట్టాను...
అందంగా
ఉన్నారని
ఆడవాళ్ళమీద అత్యాచారం చేశారు
కేసు పెట్టాను...
ఆడవాళ్ళమీద అత్యాచారం చేశారు
కేసు పెట్టాను...
సూపరు
స్టారు కాన్వెంటు వాళ్ళు
బిడ్డల్ని చేర్చుకుంటున్నారు...
సూపరు స్పెషాలిటీ ఆసుపత్రుల వాళ్ళు
రోగుల్ని చేర్చుకుంటున్నారు...
బిడ్డ లేమైపోయినా రోగు లెలా పోయినా
కేసు పెట్టటానికే వీల్లేదు..
బిడ్డల్ని చేర్చుకుంటున్నారు...
సూపరు స్పెషాలిటీ ఆసుపత్రుల వాళ్ళు
రోగుల్ని చేర్చుకుంటున్నారు...
బిడ్డ లేమైపోయినా రోగు లెలా పోయినా
కేసు పెట్టటానికే వీల్లేదు..
కుర్చీల మీద కూర్చున్నవాళ్ళకు
బావలూ వాళ్ళే,బావమరుదులు వాళ్ళే
వియ్యంకులూ వాళ్ళే, వీర భక్తులూ వాళ్ళే.
విద్య,
వైద్యం రెండూ- చెడిపోయిన
ఊపిరితిత్తులు,
ఓటువైద్యంతోనే అవి - కోలుకునే పూల గుత్తులు.
ఓటువైద్యంతోనే అవి - కోలుకునే పూల గుత్తులు.
అదృశ్య
రహస్య యుద్ధం
ఊరు
పేరు తెలియని ఏ కొండల్లోనో పుట్టి
స్వేచ్ఛగా పరుగులు తీస్తూ
ప్రవహిస్తున్న నదుల నీళ్ళకు భయమేస్తోంది
తెలుగు గడ్డమీదకు రాగానే తన నడత నచ్చకపోతే
కాళ్ళు నరికి పారేస్తారని...
స్వేచ్ఛగా పరుగులు తీస్తూ
ప్రవహిస్తున్న నదుల నీళ్ళకు భయమేస్తోంది
తెలుగు గడ్డమీదకు రాగానే తన నడత నచ్చకపోతే
కాళ్ళు నరికి పారేస్తారని...
ప్రపంచంలో
ఎక్కడినుంచో
పరమానందంతో ప్రసరిస్తూ వస్తున్న గాలికి
తెలుగు నేల సరిహద్దుల్లో గుండెల్లో నొప్పి మొదలైంది
ఏదో ఒక ప్రాంతంలోనే పడివుండకపొతే
అందరికీ ఊపిరిలా వెలిగే తన ఊపిరినే తీస్తారని...
పరమానందంతో ప్రసరిస్తూ వస్తున్న గాలికి
తెలుగు నేల సరిహద్దుల్లో గుండెల్లో నొప్పి మొదలైంది
ఏదో ఒక ప్రాంతంలోనే పడివుండకపొతే
అందరికీ ఊపిరిలా వెలిగే తన ఊపిరినే తీస్తారని...
నువ్వు
మా దానివంటే మా దానివని
కరెంటు కన్యను వీధుల్లో పెట్టి ఎవరికి వాళ్ళు లాగేస్తుంటే
మాటలు కోల్పోయిన తల్లి... చేతల్ని ఉడిగి చూస్తూ తండ్రి...
కరెంటు కన్యను వీధుల్లో పెట్టి ఎవరికి వాళ్ళు లాగేస్తుంటే
మాటలు కోల్పోయిన తల్లి... చేతల్ని ఉడిగి చూస్తూ తండ్రి...
వివిధ
దిశలకు వివిధ వర్ణ కాంతుల్ని వెదజల్లుతున్న
సరస్వతీదేవి ఆభరణాల్ని గుంజేసుకుంటున్నారు
తెగిపోతాయో ఊడిపడతాయో నని
సరస్వతికి తల నరుకుతున్నట్లుంది...
సరస్వతీదేవి ఆభరణాల్ని గుంజేసుకుంటున్నారు
తెగిపోతాయో ఊడిపడతాయో నని
సరస్వతికి తల నరుకుతున్నట్లుంది...
కృష్ణుడి
రాయబారాలు ఏవీ లేకుండానే
అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది,
విశేషం ఏమిటంటే- ఒక పక్షం గెలిచిన తరువాత కూడా
అదృశ్య రహస్య యుద్ధం జరుగుతూనే వుంది.
అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది,
విశేషం ఏమిటంటే- ఒక పక్షం గెలిచిన తరువాత కూడా
అదృశ్య రహస్య యుద్ధం జరుగుతూనే వుంది.
చీకటి గడ్డ కట్టాలి
మాసిన
వాషింగ్ మెషినులో
బంగారం వెండి బిస్కెట్లు..
.మంచం సొరుగుల్లో
వడ్డాణాలు, నెక్లేసులు
బంగారం వెండి బిస్కెట్లు..
.మంచం సొరుగుల్లో
వడ్డాణాలు, నెక్లేసులు
గోడల్లో కోట్ల కోట్ల నోట్లు
తలుపుల్లో వజ్రాలు రత్నాలు ..
.బ్యాంకు లాకర్లలో
పొలాలు స్థలాలు బంగళాలు...
బాబాకు ప్రసాదం కోసం
బంగారు పళ్ళేలు...
.బ్యాంకు లాకర్లలో
పొలాలు స్థలాలు బంగళాలు...
బాబాకు ప్రసాదం కోసం
బంగారు పళ్ళేలు...
ఇప్పుడు
తెలిసింది-
రోజు రోజుకు వెంకన్న కొండకు
భక్తు లెందుకు పెరుగుతున్నారో!
హుండీ ఆదాయం అంతకంతకు ఎందుకు పెరుగుతున్నదో!
రోజు రోజుకు వెంకన్న కొండకు
భక్తు లెందుకు పెరుగుతున్నారో!
హుండీ ఆదాయం అంతకంతకు ఎందుకు పెరుగుతున్నదో!
ఓహో...అసలు
సంగతీ కూడా తెలిసింది-
తన పేరు చెప్పి పెంచుకుంటున్న చీకటిని
గడ్డ కట్టేదాక ఓపిక పట్టి దేవుడు
ఒక్కసారే పగలగొడతా డని!
తన పేరు చెప్పి పెంచుకుంటున్న చీకటిని
గడ్డ కట్టేదాక ఓపిక పట్టి దేవుడు
ఒక్కసారే పగలగొడతా డని!
మురికి
హుండీ
చుట్టూ
మురికి చెత్త కుండీ...
చీకటి కంపు హుండీ...
మురికి చెత్త కుండీ...
చీకటి కంపు హుండీ...
ముక్కు
మూసుకోకుండానే పోతున్నాడు ఒకడు...
మూసుకోకుండానే పోతున్నాడు ఒకడు...
వ్రేళ్ళతో
ముక్కు మూసుకున్నాడు మరొకడు,
ముక్కు మూసుకున్నాడు మరొకడు,
వ్రేలు
ముక్కు మీదేసుకున్నాడు ఇంకొకడు...
ముక్కు మీదేసుకున్నాడు ఇంకొకడు...
వ్రేలు
ముక్కుమీంచి తీసేసి
ఒక చేత్తో దీపాన్ని వెలిగించి
రెండు చేతులతో పరిసరాన్ని తుడుస్తున్నాను...
ముక్కుమీంచి తీసేసి
ఒక చేత్తో దీపాన్ని వెలిగించి
రెండు చేతులతో పరిసరాన్ని తుడుస్తున్నాను...
ఇప్పుడు
చుట్టూ
పవిత్రమైన పొలం,
ఇక పరిమళిస్తూ
నా వ్రేళ్ళ మధ్య కలం.
పవిత్రమైన పొలం,
ఇక పరిమళిస్తూ
నా వ్రేళ్ళ మధ్య కలం.
దీపాల
ఫలరసం
మౌనం
ఎప్పుడూ దీపం కాదు,
భవిష్యత్తులో మానవుడికి శాపం.
భవిష్యత్తులో మానవుడికి శాపం.
నీ
మౌనం
ఒక వస్త్రం,
దాన్ని రంగురంగుల చొక్కాలుగా మార్చుకొని
మనల్ని కిందుంచి
వాడు కుర్చీల మీదెక్కి కులుకుతున్నాడు...
ఒక వస్త్రం,
దాన్ని రంగురంగుల చొక్కాలుగా మార్చుకొని
మనల్ని కిందుంచి
వాడు కుర్చీల మీదెక్కి కులుకుతున్నాడు...
మన
కోసం వీస్తున్న గాలిని
దారి మళ్ళించి వాడు లోపలికి పీల్చుకొని
మన కోసం దయ తలిచినట్లు బయటికి వదిలిపెడుతున్నాడు...
దారి మళ్ళించి వాడు లోపలికి పీల్చుకొని
మన కోసం దయ తలిచినట్లు బయటికి వదిలిపెడుతున్నాడు...
మన
కోసం పయనిస్తున్న నీటిని
తన అవసరాల చుట్టూ తిప్పుకొన్నాక
ఇది పవిత్ర జల మంటూ మనకే అమ్ముతున్నాడు...
తన అవసరాల చుట్టూ తిప్పుకొన్నాక
ఇది పవిత్ర జల మంటూ మనకే అమ్ముతున్నాడు...
పద్మవ్యూహంలో
ప్రవేశించటం బయటపడటం
ఇపుడు నేర్చుకోవలసిన పని లేదు,
బాంబులు తయారుచేసి
పరుల వ్యూహాన్నిబద్దలుకొట్టటమే నేటి విద్య,
ఇపుడు నేర్చుకోవలసిన పని లేదు,
బాంబులు తయారుచేసి
పరుల వ్యూహాన్నిబద్దలుకొట్టటమే నేటి విద్య,
కొడవలితో
గడ్డి గొంతు తెగ్గోయనక్కరలేదు,
గొడ్డలితో
చెట్ల కాళ్ళు నరికేయవలసిన అవసరం లేదు...
ప్రొక్లెయినరులు ఉత్పత్తి చేసి
పుడమి గుండె కాయల్ని చీల్చుకొని
రక్త బీజా లేరుకొని తినటం నేటి కళ...
గడ్డి గొంతు తెగ్గోయనక్కరలేదు,
గొడ్డలితో
చెట్ల కాళ్ళు నరికేయవలసిన అవసరం లేదు...
ప్రొక్లెయినరులు ఉత్పత్తి చేసి
పుడమి గుండె కాయల్ని చీల్చుకొని
రక్త బీజా లేరుకొని తినటం నేటి కళ...
నీ
గొంతును నీవే
నీకే తెలియకుండా నులిమేసుకుంటున్నంత మంచివాడివి...
నీ కెంత ఆకలయినా
ఎవడి సొమ్ము తినకుండా
నీకే తెలియకుండా నీ కండలు నువ్వే ముక్కలు చేసుకు తింటున్నంత మర్యాదస్తుడివి ...
నీకే తెలియకుండా నులిమేసుకుంటున్నంత మంచివాడివి...
నీ కెంత ఆకలయినా
ఎవడి సొమ్ము తినకుండా
నీకే తెలియకుండా నీ కండలు నువ్వే ముక్కలు చేసుకు తింటున్నంత మర్యాదస్తుడివి ...
మన
మెందుకు మనుషులుగా పుట్టామో
ఎందుకు బతుకుతున్నామో....
కనీసం చచ్చేటప్పుడైనా
మనం మనుషులుగా చావొచ్చుగదా,
నిజాన్ని కనిపెట్టి నలుగురికీ
నోరు తెరిచి చెప్పొచ్చుగదా...
ఎందుకు బతుకుతున్నామో....
కనీసం చచ్చేటప్పుడైనా
మనం మనుషులుగా చావొచ్చుగదా,
నిజాన్ని కనిపెట్టి నలుగురికీ
నోరు తెరిచి చెప్పొచ్చుగదా...
ఒరే
మనిషీ, నీ
మౌనం
చినుకుల్ని కాల్చుకుతింటున్న అగ్ని పర్వతం,
పువ్వుల్ని నంజుకు తింటున్న మహా రాక్షస వ్రతం.
చినుకుల్ని కాల్చుకుతింటున్న అగ్ని పర్వతం,
పువ్వుల్ని నంజుకు తింటున్న మహా రాక్షస వ్రతం.
ఒరే
తమ్ముడూ, నా
మాట వినరా...
ఒక మాట చెప్పరా...
చీకటి మద్యం సీసాను నీ మాటతో పగలగొట్టి
దీపావళి ఫలరసాన్నిసేకరించి విశ్వానికి పంచరా...
ఒక మాట చెప్పరా...
చీకటి మద్యం సీసాను నీ మాటతో పగలగొట్టి
దీపావళి ఫలరసాన్నిసేకరించి విశ్వానికి పంచరా...
తెలుపును
వెనక్కి నలపకు
నీవు
ఒక దూది మేడ ...
నీ మనసులో అగ్గి రవ్వలు రగిలిస్తున్నావు...
ఒక దూది మేడ ...
నీ మనసులో అగ్గి రవ్వలు రగిలిస్తున్నావు...
నీ
చుట్టూ
ఒక మల్లె పూల వనం
నీ మాటలలో కత్తులు తిప్పుతున్నావు...
ఒక మల్లె పూల వనం
నీ మాటలలో కత్తులు తిప్పుతున్నావు...
నీ
బతుకు
ఒక వెన్నెల క్షేత్రం...
రాహు కేతువులతో నీ చేతలు కలుపుతున్నావు...
ఒక వెన్నెల క్షేత్రం...
రాహు కేతువులతో నీ చేతలు కలుపుతున్నావు...
తెలుపును
నలుపు చేస్తున్న చెలికాడా...
తెలుపును
వెనక్కి నలపకు...
తెలుపంటూ వేరే లేదు-
నలుపు పండితే తెలుపవుతుంది...
తెలుపే నీ బతుక్కి గెలు పవుతుంది.
నలుపు చేస్తున్న చెలికాడా...
తెలుపును
వెనక్కి నలపకు...
తెలుపంటూ వేరే లేదు-
నలుపు పండితే తెలుపవుతుంది...
తెలుపే నీ బతుక్కి గెలు పవుతుంది.
చొక్కా
చొక్కాను
అదే పనిగా తడపకు,
మాటిమాటికీ పిండకు,
తొడుక్కోలేవు...
అదే పనిగా తడపకు,
మాటిమాటికీ పిండకు,
తొడుక్కోలేవు...
ఏ
చెమటతోనో
ఏ దుమ్ముతోనో
నిదానంగా మురికిపడుతుంటే
చక్కగా ఉతుక్కో,
ధైర్యంగా ఆరబెట్టుకో,
హుందాగా ధరించవచ్చు...
ఏ దుమ్ముతోనో
నిదానంగా మురికిపడుతుంటే
చక్కగా ఉతుక్కో,
ధైర్యంగా ఆరబెట్టుకో,
హుందాగా ధరించవచ్చు...
మనస్సు
జీవితానికి తొడిగే చొక్కా లాంటిది.
జీవితానికి తొడిగే చొక్కా లాంటిది.
పచ్చని
బంధం
ఎవరూ ఎత్తి పడేసింది లేదు,
గడ్డ పలుగుతో పగలగొట్టింది లేదు...
రోలు నిప్పుటెండలో పగిలిపోయింది...
గడ్డ పలుగుతో పగలగొట్టింది లేదు...
రోలు నిప్పుటెండలో పగిలిపోయింది...
ఎవరూ పోషించటం లేదు,
బలమైన టానిక్కులు
అందించటం లేదు...
చెట్టు
మండుటెండలో పచ్చగా అందంగా వెలుగుతోంది...
బలమైన టానిక్కులు
అందించటం లేదు...
చెట్టు
మండుటెండలో పచ్చగా అందంగా వెలుగుతోంది...
అమ్మ
చేతిలోంచి జారి పడ్డ
పసిబిడ్డలా మానవుడు
ఎండలో వాడిపోతూ, మాడిపోతూ, కాలిపోతూ...
పసిబిడ్డలా మానవుడు
ఎండలో వాడిపోతూ, మాడిపోతూ, కాలిపోతూ...
కారణం
ఏంటి!
రోలుకు
భూమితో సంబంధం లేదు,
చెట్టు భూమిని పెనవేసుకుంది...
చెట్టు భూమిని పెనవేసుకుంది...
భూమికి
మనిషికి
పుట్టుకతో సహజ బంధం...
మొక్కల్ని నాటి పెంచుకుంటే
అనుబంధం బలపడుతుంది,
ప్రాణంతో నడిచే మరో చెట్టులా
పచ్చపచ్చగా నిలబడుతుంది.
పుట్టుకతో సహజ బంధం...
మొక్కల్ని నాటి పెంచుకుంటే
అనుబంధం బలపడుతుంది,
ప్రాణంతో నడిచే మరో చెట్టులా
పచ్చపచ్చగా నిలబడుతుంది.
పడు
పడు పడు...
అదిరిపడు, దిగులుపడు...
పడు పడు పడు...
కలతపడు, మధనపడు...
అదిరిపడు, దిగులుపడు...
పడు పడు పడు...
కలతపడు, మధనపడు...
పడు,
పడు,
పడు... అదిరిపడు...
పొలం తరిగిపోతోంది
హలం విరిగిపోతోంది...
పొలం తరిగిపోతోంది
హలం విరిగిపోతోంది...
పడు,
పడు,
పడు...
దిగులు పడు...
తరులు వాలిపోతున్నాయి
గిరులు కూలిపోతున్నాయి...
దిగులు పడు...
తరులు వాలిపోతున్నాయి
గిరులు కూలిపోతున్నాయి...
పడు,
పడు,
పడు...
కలత పడు...
రవిని గ్రహం పట్టింది
భువిని అహం చుట్టింది...
కలత పడు...
రవిని గ్రహం పట్టింది
భువిని అహం చుట్టింది...
పడు,
పడు,
పడు...
మధనపడు...
మనసు మురికి కాగా
మనిషి ఇరుకు బాగా...
మధనపడు...
మనసు మురికి కాగా
మనిషి ఇరుకు బాగా...
పడు,
పడు,
పడు... ఎగిసి పడు...
అగ్ని గర్భ కుసుమం నీవై,
కుసుమ హృదయ జ్వాలవు నీవై...
అగ్ని గర్భ కుసుమం నీవై,
కుసుమ హృదయ జ్వాలవు నీవై...
చెమటబొట్టు
శ్రమజీవి
చెమటబొట్టు
అవనికి
ఆయువుపట్టు
చెమటబొట్టు
అవనికి
ఆయువుపట్టు
లక్ష్మీ
దేవికి
చీరకట్టు
ముఖం మీద
కుంకుమబొట్టు
చీరకట్టు
ముఖం మీద
కుంకుమబొట్టు
ప్రగతికి
తొలిమెట్టు
పరిశ్రమల
గుండెగుట్టు
తొలిమెట్టు
పరిశ్రమల
గుండెగుట్టు
ఆరోగ్యం
కొలను గట్టు
ఆనందం
తేనె పట్టు
కొలను గట్టు
ఆనందం
తేనె పట్టు
విజయానికి ఆటపట్టు
విప్లవానికి ఉనికిపట్టు
విప్లవానికి ఉనికిపట్టు
శ్రమజీవుల్ని సుఖపెట్టు
సంపదల్ని పంచిపెట్టు
సంపదల్ని పంచిపెట్టు
కాలంతో
మనిషి
రాజుల
పాలనలో
కాలం కన్నా మనిషి బాగా వెనకబడ్డాడు,
ఆంగ్లేయుల పాలనలో
లేచి నిలబడి, నడవటం మొదలుపెట్టాడు,
స్వతంత్రం వచ్చాక
కాలంతోపాటు సమానంగా పరుగు మొదలుపెట్టాడు...
కాలం కన్నా మనిషి బాగా వెనకబడ్డాడు,
ఆంగ్లేయుల పాలనలో
లేచి నిలబడి, నడవటం మొదలుపెట్టాడు,
స్వతంత్రం వచ్చాక
కాలంతోపాటు సమానంగా పరుగు మొదలుపెట్టాడు...
ఇపుడు
బాగా చదువుకున్నాక
అరచేతిలోకి విజ్ఞానం అంది వచ్చాక
మనిషి కాలంతో పోటీ పడుతూ,
కాలం కన్నా వేగంగా పరుగులు తీస్తూ,
సూర్యుడు అస్తమించేలోగా
విశ్వమంతా ఆక్రమించాలని తపించి పోతూ...
అరచేతిలోకి విజ్ఞానం అంది వచ్చాక
మనిషి కాలంతో పోటీ పడుతూ,
కాలం కన్నా వేగంగా పరుగులు తీస్తూ,
సూర్యుడు అస్తమించేలోగా
విశ్వమంతా ఆక్రమించాలని తపించి పోతూ...
మనసు
ముందుకు దూసుకుపోతున్నది కాని
దారిలో
గుండె ఎక్కడో పడిపోయింది.
ముందుకు దూసుకుపోతున్నది కాని
దారిలో
గుండె ఎక్కడో పడిపోయింది.
బతికున్నానో
లేదో నాకే తెలియదు
గోళ్ళబ్లేడుతో పూల గొంతులు కోసి
పరిమళాలు దోచుకుంటున్నాను కాని
మొక్క నవ్వుతున్నదో ఏడుస్తున్నదో పట్టించుకోలేదు...
పరిమళాలు దోచుకుంటున్నాను కాని
మొక్క నవ్వుతున్నదో ఏడుస్తున్నదో పట్టించుకోలేదు...
రాళ్ల
కత్తులతో కాయల
కాళ్ళు నరికి
ఆహారం దాచుకుంటున్నాను కాని
చెట్టు ఆనందం పొండుతున్నదో దిగులు చెందుతున్నదో ఆలోచించలేదు...
ఆహారం దాచుకుంటున్నాను కాని
చెట్టు ఆనందం పొండుతున్నదో దిగులు చెందుతున్నదో ఆలోచించలేదు...
ఆకలి
గుహలో రకరకాల
పదార్ధాల్ని
నింపుకుంటున్నాను కాని
రైతు అన్నం తిన్నాడో పస్తులే ఉన్నాడో ఊహించలేదు,
నింపుకుంటున్నాను కాని
రైతు అన్నం తిన్నాడో పస్తులే ఉన్నాడో ఊహించలేదు,
ఇల్లాలు
చేసి పెట్టిన వంటల
రుచులు అరగిస్తున్నాను కాని
"ఒంట్లో ఎలా ఉంది,
అన్నం తిన్నావా లేదా" అని అడిగిన సందర్భం గుర్తు లేదు...
"ఒంట్లో ఎలా ఉంది,
అన్నం తిన్నావా లేదా" అని అడిగిన సందర్భం గుర్తు లేదు...
గడ్డకడుతున్న
దూరాల్ని వాహనాల సుత్తులతో పగలగొట్టుకుంటూ వెళుతున్నా కాని
దాహం కొరడా దెబ్బలకు ఫ్రిజ్ వాటర్ కవచాన్ని కప్పుకుంటున్నా కాని
ఎండ మంటలకు ఏసీ పూల యంత్రంతో కులుకుతున్నాను కాని
చుట్టూ ఉన్న గాలిని, నీటిని
బతికిస్తున్నానా చంపుతున్నానా అని గమనించలేదు...
దాహం కొరడా దెబ్బలకు ఫ్రిజ్ వాటర్ కవచాన్ని కప్పుకుంటున్నా కాని
ఎండ మంటలకు ఏసీ పూల యంత్రంతో కులుకుతున్నాను కాని
చుట్టూ ఉన్న గాలిని, నీటిని
బతికిస్తున్నానా చంపుతున్నానా అని గమనించలేదు...
ఎందుకంటే...నేనిప్పుడు
బతికున్నానో లేదో నాకే తెలియదు
నాలో మనిషిని పాతరేసి డబ్బు మహిషి నన్నాక్రమించింది.
బతికున్నానో లేదో నాకే తెలియదు
నాలో మనిషిని పాతరేసి డబ్బు మహిషి నన్నాక్రమించింది.
పాము
తిరుగుతోంది జాగ్రత్త!
పాము
తిరుగుతోంది
జాగ్రత్త,
రోడ్డు మీద మనుషులు నడుస్తున్నారు...
జాగ్రత్త,
రోడ్డు మీద మనుషులు నడుస్తున్నారు...
రోడ్డు
పక్క వీధి లైట్లు
ఒక్కటీ కూడా వెలగదు
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు చీకటి.
ఒక్కటీ కూడా వెలగదు
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు చీకటి.
రోడ్డు
పక్క బాగా పెరిగిన
ఎండిపోయిన ముళ్ళ కంపలు,
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు నయ వంచన.
ఎండిపోయిన ముళ్ళ కంపలు,
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు నయ వంచన.
రోడ్డు
పక్క డ్రయినేజీ
నీళ్ళు కదలక మురికి పొదలు
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు పట్టని తనం,
నీళ్ళు కదలక మురికి పొదలు
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు పట్టని తనం,
రోడ్డు
పక్క శిథిలమైన
పాత రాళ్ల కుప్పలు,
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు మూఢ జాడ్యం.
పాత రాళ్ల కుప్పలు,
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు మూఢ జాడ్యం.
కారుల్లో,
పెద్ద పెద్ద వాహనాల్లో
వెళ్ళేవాళ్ళు భయపడరు
పామే నుజ్జునుజ్జు కావచ్చు
దారికి అడ్డం పొతే...
వెళ్ళేవాళ్ళు భయపడరు
పామే నుజ్జునుజ్జు కావచ్చు
దారికి అడ్డం పొతే...
మంచి
నడత, చక్కని
నడక
అవక్రంగా సాగి పోతున్న మనుషుల్లారా,
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు పరిపాలన.
అవక్రంగా సాగి పోతున్న మనుషుల్లారా,
పాము తిరుగుతోంది,
జాగ్రత,
ఆ పాము పేరు పరిపాలన.
మనసును
జారిపోనీయకుండా
ఆలోచనలు కారిపోనీయకుండా
చేతుల్ని జ్యోతులుగా మార్చుకోగలిగితేనే
రోడ్డు మీద మనిషన్న వాడు
సుఖంగా పయనించగలుగుతాడు.
ఆలోచనలు కారిపోనీయకుండా
చేతుల్ని జ్యోతులుగా మార్చుకోగలిగితేనే
రోడ్డు మీద మనిషన్న వాడు
సుఖంగా పయనించగలుగుతాడు.
పిడికిళ్ల
తూర్పు సముద్రం
నిప్పన్నా
మంటన్నా
చలికి భయం-
అందుకే
రక్తంలో నిప్పు లున్న జంతువుల్ని
మనసులో మంట లున్న మనుషుల్ని
వణికిస్తుంది చలి
బెరిస్తుంది మరీ...
చలికి భయం-
అందుకే
రక్తంలో నిప్పు లున్న జంతువుల్ని
మనసులో మంట లున్న మనుషుల్ని
వణికిస్తుంది చలి
బెరిస్తుంది మరీ...
నోరు
లేని బండల్ని
కదలలేని కొండల్ని
నమ్ముతుంది చలి
స్నేహిస్తుంది మరీ...
కదలలేని కొండల్ని
నమ్ముతుంది చలి
స్నేహిస్తుంది మరీ...
భయపడటం
నుంచే
తిరుగుబాటు బావుటా పైకి,
భయపెట్టటం నుంచే
ఓటమికి పునాదిరాయి కిందికి...
తిరుగుబాటు బావుటా పైకి,
భయపెట్టటం నుంచే
ఓటమికి పునాదిరాయి కిందికి...
తూర్పు
సముద్రం మౌనంగా
పిడికిళ్ళు బిగించి పైకెత్తుతుంటే
వీస్తున్న చలికి గుండె నిండా అసహనం
కొత్త పవనానికి త్వరలో సముద్ర ఆహ్వానం.
పిడికిళ్ళు బిగించి పైకెత్తుతుంటే
వీస్తున్న చలికి గుండె నిండా అసహనం
కొత్త పవనానికి త్వరలో సముద్ర ఆహ్వానం.
భయం
నేను
నడుస్తున్నా...
ఓ కుక్క కూడా దూరంగా నన్నే చూస్తూ
నా వైపే నడుస్తూ...
ఓ కుక్క కూడా దూరంగా నన్నే చూస్తూ
నా వైపే నడుస్తూ...
వేగంగా
సందేహ దేహంతో నడుస్తున్నా,
కుక్క కూడా అంతే వేగంగా...
సందేహ దేహంతో నడుస్తున్నా,
కుక్క కూడా అంతే వేగంగా...
భయం
కాళ్లతో
పరుగెత్తుతున్నా,
కుక్క కూడా పరుగెత్తుతూనే...
పరుగెత్తుతున్నా,
కుక్క కూడా పరుగెత్తుతూనే...
నా
రక్తంలో విరిగిపడుతున్న
మట్టిబెళ్ళలు,
నా గుండె మీద కూలి పడుతున్న రాతి గోడలు....
నా గుండె మీద కూలి పడుతున్న రాతి గోడలు....
ఇక
తప్పక నిలబడిపోయా,
కుక్క కూడా నిలబడిపోయింది...
కుక్క కూడా నిలబడిపోయింది...
మెల్లగా
నా దగ్గరకు చేరి
దాని మనసుతో నా కాళ్ళు నాకుతూ...
నా ఎదురుగా కూర్చొని
దాని కళ్లతో నన్ను ప్రేమగా చూస్తూ...
దాని మనసుతో నా కాళ్ళు నాకుతూ...
నా ఎదురుగా కూర్చొని
దాని కళ్లతో నన్ను ప్రేమగా చూస్తూ...
అంతే...
కర్రతో మోదాలనుకొన్న నా ఆలోచనలు
రాళ్లతో కొట్టాలనుకొన్న నా భయాలు
అన్నీ సిగ్గుతో మొగ్గలుగా రాలిపోయాయి.
కర్రతో మోదాలనుకొన్న నా ఆలోచనలు
రాళ్లతో కొట్టాలనుకొన్న నా భయాలు
అన్నీ సిగ్గుతో మొగ్గలుగా రాలిపోయాయి.
భోగి మంట కావాలి
నేను
పీలుస్తున్న గాలి
నేను తాగుతున్న నీరు
నాకు ప్రకృతి ఇచ్చింది,
నేను తింటున్న తిండి
నేను కట్టుకుంటున్న బట్ట
రైతు శ్రామికుడు ఇచ్చారు...
నేను తాగుతున్న నీరు
నాకు ప్రకృతి ఇచ్చింది,
నేను తింటున్న తిండి
నేను కట్టుకుంటున్న బట్ట
రైతు శ్రామికుడు ఇచ్చారు...
ప్రకృతిని
చెరిచేవాళ్ళు
రైతును అరిచేవాళ్ళు
శ్రామికుడిని కరిచేవాళ్ళు
నాకు శత్రువులు...
రైతును అరిచేవాళ్ళు
శ్రామికుడిని కరిచేవాళ్ళు
నాకు శత్రువులు...
సిగ్గు
లేకుండా తలుపేసుకొని
అంతఃపురంలోకి దూరి
ఆత్మ ప్రేయసితో ఆత్మీయ సంభాషణ
ఆరంభించను...
ఆకాశం పైకెక్కి
రెక్కల గంధర్వుల్ని పిలిచి
విచిత్ర చిత్ర గీతాలు
పాడను...
అంతఃపురంలోకి దూరి
ఆత్మ ప్రేయసితో ఆత్మీయ సంభాషణ
ఆరంభించను...
ఆకాశం పైకెక్కి
రెక్కల గంధర్వుల్ని పిలిచి
విచిత్ర చిత్ర గీతాలు
పాడను...
నా
కలం
రైతు చేతిలో నాగలి కావాలి,
లేదా సాంకేతికత పెరిగిన
ట్రాక్టరు కావాలి...
నా కవిత
పొలానికి కాపలా కాసే
వెచ్చని చుట్ట కావాలి,
లేదా పురుగుకు మందు చల్లే
మంచి యంత్రం కావాలి...
రాజకీయాల్ని కాల్చేసే
భోగి మంట కావాలి,
కాలుష్యం అంటని పంటను ఇంటికి మోసుకొచ్చే బండి కావాలి
రైతు చేతిలో నాగలి కావాలి,
లేదా సాంకేతికత పెరిగిన
ట్రాక్టరు కావాలి...
నా కవిత
పొలానికి కాపలా కాసే
వెచ్చని చుట్ట కావాలి,
లేదా పురుగుకు మందు చల్లే
మంచి యంత్రం కావాలి...
రాజకీయాల్ని కాల్చేసే
భోగి మంట కావాలి,
కాలుష్యం అంటని పంటను ఇంటికి మోసుకొచ్చే బండి కావాలి
కొత్త
నక్షత్రాలని కనిపెట్టి
కొత్త శాస్త్రం సృష్టించటం ఇష్టమే కాని
కన్నులు నెత్తి కెక్కిన నక్షత్రాలని కిందికి దించి
పంటలుగా మార్చాలనే మక్కువ నా కెక్కువ.
కొత్త శాస్త్రం సృష్టించటం ఇష్టమే కాని
కన్నులు నెత్తి కెక్కిన నక్షత్రాలని కిందికి దించి
పంటలుగా మార్చాలనే మక్కువ నా కెక్కువ.
అక్షరాలు
అక్షరాల్ని
మట్టిలో విత్తాను
పంటలుగా మారాయి...
మట్టిలో విత్తాను
పంటలుగా మారాయి...
అక్షరాల్ని
నేల మీద కు రిశాను
కాల్వలు నదులుగా ప్రవహించాయి...
నేల మీద కు రిశాను
కాల్వలు నదులుగా ప్రవహించాయి...
అక్షరాల్ని
ఆకాశంలోకి విసిరాను
సూర్య చంద్ర నక్షత్రాలుగా వెలిశాయి...
ఆకాశంలోకి విసిరాను
సూర్య చంద్ర నక్షత్రాలుగా వెలిశాయి...
అక్షరాల్ని
నా గుండెలో ప్రతిష్టించుకొన్నాను
నేను మనిషి నయ్యాను.
నా గుండెలో ప్రతిష్టించుకొన్నాను
నేను మనిషి నయ్యాను.
సౌందర్యం
సూర్యుడిని చూశాను
చంద్రుడిని చూశాను
భూమిని నక్షత్రాల్ని చూశాను
పువ్వుల్ని నవ్వుల్ని చూశాను...
ఓహ్....సౌందర్య మంటే
గుండ్రంగా వుంటుందన్న మాట!
చంద్రుడిని చూశాను
భూమిని నక్షత్రాల్ని చూశాను
పువ్వుల్ని నవ్వుల్ని చూశాను...
ఓహ్....సౌందర్య మంటే
గుండ్రంగా వుంటుందన్న మాట!
వెన్నెల
పుస్తకాలలోకి వెళ్ళాలి...
ఈ
ఇల్లంతా నాదే అనుకుంటావు
ఇందులో కోట్లాది
అదృశ్య జీవులున్నా యని తెలుసుకోలేవు...
ఇందులో కోట్లాది
అదృశ్య జీవులున్నా యని తెలుసుకోలేవు...
ఇపుడు
వీస్తున్న గాలంతా నాదే అనుకుంటావు
ఇందులో అనంత
సూక్ష్మ ప్రాణు లున్నాయని తెలుసుకోలేవు...
ఇందులో అనంత
సూక్ష్మ ప్రాణు లున్నాయని తెలుసుకోలేవు...
ఈ
దేహం అంతా నాదే అనుకుంటావు
ఇందులో అగణిత
వైరసు లున్నాయని తెలుసుకోలేవు...
ఇందులో అగణిత
వైరసు లున్నాయని తెలుసుకోలేవు...
ఈ
దేశం అంతా నాదే అనుకుంటావు
ఇందులో లక్షలాది
కనిపించని సంకెళ్ళున్నా యని తెలుసుకోలేవు...
ఇందులో లక్షలాది
కనిపించని సంకెళ్ళున్నా యని తెలుసుకోలేవు...
ఇవే
తెలుసుకోలేవి నువ్వు
నీ మనసులో
అనంత అంధకారా లున్నాయని ఎలా తెలుసుకోగలుగుతావు!
వెన్నెల పుస్తకాలలోనికి
ఎలా నీ ప్రస్థానం ప్రారంభించగలుగుతావు!
నీ మనసులో
అనంత అంధకారా లున్నాయని ఎలా తెలుసుకోగలుగుతావు!
వెన్నెల పుస్తకాలలోనికి
ఎలా నీ ప్రస్థానం ప్రారంభించగలుగుతావు!
కాలం
కాలం
కలప అడితి,
చక్కగా కోసి
కిటికీ దర్వాజాలుగా మార్చి
అందమైన జీవన భవనం సృజించుకోవాలి మనిషి...
కలప అడితి,
చక్కగా కోసి
కిటికీ దర్వాజాలుగా మార్చి
అందమైన జీవన భవనం సృజించుకోవాలి మనిషి...
కాలం
ఉప్పు సముద్రం,
సారం తీసి
మేఘంగా మార్చి
స్వచ్ఛ జలం అందించే
సూర్యుడు కావాలి నరుడు...
ఉప్పు సముద్రం,
సారం తీసి
మేఘంగా మార్చి
స్వచ్ఛ జలం అందించే
సూర్యుడు కావాలి నరుడు...
కాలం
మసి బొగ్గు గని,
బయటకు తీసి
యంత్రాలలో కాల్చి
విద్యుత్ వెలిగించుకోవాలి మానవుడు...
మసి బొగ్గు గని,
బయటకు తీసి
యంత్రాలలో కాల్చి
విద్యుత్ వెలిగించుకోవాలి మానవుడు...
కాలం
వాయు సమ్మేళనం,
మెల్లగా పీల్చి
ప్రాణవాయువును గ్రహించి
కణాల కన్నిటికీ పంచే
ఊపిరితిత్తుల్లా సాగేదే బతుకు...
వాయు సమ్మేళనం,
మెల్లగా పీల్చి
ప్రాణవాయువును గ్రహించి
కణాల కన్నిటికీ పంచే
ఊపిరితిత్తుల్లా సాగేదే బతుకు...
ఇల్లు
ఒక్కటే ఇల్లు కాదు-
అందులో ఉండే
నీరూ వెలుతురూ గాలి కూడా ఇల్లే...
దేశ మంటే మట్టి ఒక్కటే కాదు,
గాలి నీరు నిప్పు ఆకాశం
మనుషులు మృగాలు పక్షులు సకల జీవరాశి కూడా...
అందులో ఉండే
నీరూ వెలుతురూ గాలి కూడా ఇల్లే...
దేశ మంటే మట్టి ఒక్కటే కాదు,
గాలి నీరు నిప్పు ఆకాశం
మనుషులు మృగాలు పక్షులు సకల జీవరాశి కూడా...
కాలం
మనిషిని నాయకుణ్ణి చేసింది
నిజమే కాని-
కాలానికి సేవ చేసుకోవాలి మనిషి...
కాలంతో వ్యాపారం చేస్తే మసి.
నిజమే కాని-
కాలానికి సేవ చేసుకోవాలి మనిషి...
కాలంతో వ్యాపారం చేస్తే మసి.
మనిషి
లోని నది
ప్రతి
జీవిలోనూ
ఒక నది...
కొన్నిటిలో ప్రవహిస్తూ...
కొన్నిటిలో ఘనీభవిస్తూ...
మరి కొన్నిటిలో రాయైపోయి...
ఒక నది...
కొన్నిటిలో ప్రవహిస్తూ...
కొన్నిటిలో ఘనీభవిస్తూ...
మరి కొన్నిటిలో రాయైపోయి...
చెట్లలో
జీవ నదులు-
అడ్డుకట్టలు ఆపలేవు
ఆనకట్టలు నిలపలేవు..
ప్రపంచంలోకి
నిరంతరం చొచ్చుకుపోతాయి...
జీవ నదులు-
అడ్డుకట్టలు ఆపలేవు
ఆనకట్టలు నిలపలేవు..
ప్రపంచంలోకి
నిరంతరం చొచ్చుకుపోతాయి...
పక్షుల్లో
విశాల నదీ నదాలు-
రెక్కలపై లోకాన్ని కప్పుతూ...
లోకంపై రెక్కల్ని విప్పుతూ.
పగలును మేలుకొలుపుతూ
రాత్రిని నిద్రబుచ్చుతూ...
విశాల నదీ నదాలు-
రెక్కలపై లోకాన్ని కప్పుతూ...
లోకంపై రెక్కల్ని విప్పుతూ.
పగలును మేలుకొలుపుతూ
రాత్రిని నిద్రబుచ్చుతూ...
మృగాల్లో
బరువైన నదులు-
నెమ్మదిగా కదులుతూ
పుడమిని చుట్టేసుకుంటాయి
ప్రాణుల్ని పట్టేసుకుంటాయి
మనుషుల్ని వాటేసుకుంటాయి
బరువైన నదులు-
నెమ్మదిగా కదులుతూ
పుడమిని చుట్టేసుకుంటాయి
ప్రాణుల్ని పట్టేసుకుంటాయి
మనుషుల్ని వాటేసుకుంటాయి
మనుషుల్లో
తల్లి కడుపులో పడ్డ నది విత్తనం
మనిషిగా ప్రవహించటం మొదలుపెడుతుంది...
బాల్య మంతటా నది గలగల...
తరువాత కోరికల చలి తీవ్రత
ముదిరితే కదలని కొండై స్తబ్ధత..
తల్లి కడుపులో పడ్డ నది విత్తనం
మనిషిగా ప్రవహించటం మొదలుపెడుతుంది...
బాల్య మంతటా నది గలగల...
తరువాత కోరికల చలి తీవ్రత
ముదిరితే కదలని కొండై స్తబ్ధత..
బతికినంత
కాలం మనిషి
లోపల, బయట
నదిగా ప్రవహించాలి,
మనిషి పోయినా సరే
జీవనదిగా రాణించాలి.
లోపల, బయట
నదిగా ప్రవహించాలి,
మనిషి పోయినా సరే
జీవనదిగా రాణించాలి.
నన్ను
చదవని వాళ్ళు...
నన్ను
చదవటం కన్నా
నన్ను
చూడటమే వాళ్లకు బాగా ఇష్టం,
ఓర చూపులతో గిచ్చుతూనో,
ఓర చూపులతో గిచ్చుతూనో,
కోర తూపులతో గుచ్చుతూనో...
నిటారు
పర్వతాన్ని గుండె దిటవుతో నే నెక్కుతూ
పడబోయి నిలదొక్కుకుంటుంటే
జారి పడుతుంటే చూడాలని వారి కిష్టం,
పర్వతం మీదున్న ప్రపంచాన్ని చూడాలనే
నన్ను, నా గుండె పుస్తకాన్ని వాళ్ళు చదవటం లేదు..
పడబోయి నిలదొక్కుకుంటుంటే
జారి పడుతుంటే చూడాలని వారి కిష్టం,
పర్వతం మీదున్న ప్రపంచాన్ని చూడాలనే
నన్ను, నా గుండె పుస్తకాన్ని వాళ్ళు చదవటం లేదు..
లోతైన
నదిని నాటు పడవతో నేను దాటుతుంటే
సుడిగుండాల్లో పడి పైకి లేచి వస్తుంటే
నాతో నా పడవ మునిగిపోతుంటే చూడాలని వారి కిష్టం,
నది కావల ఉన్న నా ఊరిని చూడాలనే
నన్ను, నా పడవ దీపాన్ని వాళ్ళు చదవటం లేదు...
సుడిగుండాల్లో పడి పైకి లేచి వస్తుంటే
నాతో నా పడవ మునిగిపోతుంటే చూడాలని వారి కిష్టం,
నది కావల ఉన్న నా ఊరిని చూడాలనే
నన్ను, నా పడవ దీపాన్ని వాళ్ళు చదవటం లేదు...
దట్టమైన
అరణ్యాన్ని జ్వాలాధారినై నేను దాటుతుంటే
అపాయ క్షణాల నోళ్ళకు చిక్కకుండా నడుస్తుంటే
ఏ పులికో చిక్కితే చూడాలని వారి కిష్టం,
అరణ్యాన్ని దాటి కొత్త ప్రపంచాన్ని చూడాలనే
నా చేతిలోని సూర్యుడిని వాళ్ళు చదవటం లేదు...
అపాయ క్షణాల నోళ్ళకు చిక్కకుండా నడుస్తుంటే
ఏ పులికో చిక్కితే చూడాలని వారి కిష్టం,
అరణ్యాన్ని దాటి కొత్త ప్రపంచాన్ని చూడాలనే
నా చేతిలోని సూర్యుడిని వాళ్ళు చదవటం లేదు...
ఇంతలో
ఆకాశవాణి పలికింది
చూడటం ఇక ఆపి చదవండిరా...అని!
వెంటనే తేరుకొని ఇప్పుడిప్పుడే
నన్ను చదవటం మొదలుపెట్టారు,
నా గుండెను, నా పడవను, నా సూర్యుడిని
ఆకాశంలో ముఖ్య భాగంగా కొత్త చూపు మొదలుపెట్టారు.
చూడటం ఇక ఆపి చదవండిరా...అని!
వెంటనే తేరుకొని ఇప్పుడిప్పుడే
నన్ను చదవటం మొదలుపెట్టారు,
నా గుండెను, నా పడవను, నా సూర్యుడిని
ఆకాశంలో ముఖ్య భాగంగా కొత్త చూపు మొదలుపెట్టారు.
నది
అంటే కమ్మని కవిత్వం
ఏ
నదికైనా ఎందు కుంటుంది-
పోయి పోయి సముద్రంలో పడి పాతాళం కావాలని!
ఏ నదికైనా ఎందు కుంటుంది-
కాళ్ళకు వ్రేళ్ళకు సంకెళ్ళు వేయించుకొని
ఒక దొరదగ్గర బానిసగా పడివుండా లని!
పొలంలోకి వెళ్లి అన్నంముద్ద కావాలని నదికి మది,
పంపులోకి చేరి ప్రాణరూపం పొందాలని నదికి హృది...
పోయి పోయి సముద్రంలో పడి పాతాళం కావాలని!
ఏ నదికైనా ఎందు కుంటుంది-
కాళ్ళకు వ్రేళ్ళకు సంకెళ్ళు వేయించుకొని
ఒక దొరదగ్గర బానిసగా పడివుండా లని!
పొలంలోకి వెళ్లి అన్నంముద్ద కావాలని నదికి మది,
పంపులోకి చేరి ప్రాణరూపం పొందాలని నదికి హృది...
నది
అంటే అమ్మ బొమ్మలకు
అమ్మతనంతో ప్రాణం పోసే బ్రహ్మ రూపం,
ప్రాణికోటి దేహ భవనాలను
వెలిగించే మహా జల దీపం...
మన మనుగడల వాహనాల్ని నడిపే ఇంధనం...
అమ్మతనంతో ప్రాణం పోసే బ్రహ్మ రూపం,
ప్రాణికోటి దేహ భవనాలను
వెలిగించే మహా జల దీపం...
మన మనుగడల వాహనాల్ని నడిపే ఇంధనం...
ఓ
మనిషీ, నదిలో
మునిగితే మునుగు-
పసిబిడ్డను గుండెకు హత్తుకున్నట్లుగానో
మాతృమూర్తి ఒడిలో తపనతో ఒదుగుతున్నట్లుగానో
ఎలాగైనా సరే గుండెలో పువ్వుల్ని పెట్టుకొని నదిలో మునుగు..
.
నీవు మునగాల్సింది నీ కోసం కాదు-
నీ దేశం కోసం మునుగు... ఈ ప్రపంచం కోసం మునుగు...
పుడమి నిండా వికసించాలని నదిని కోరుకుంటూ మునుగు...
అదీ పుష్కర స్నాన మంటే... అదే ముష్కర హనన మంటే...
పసిబిడ్డను గుండెకు హత్తుకున్నట్లుగానో
మాతృమూర్తి ఒడిలో తపనతో ఒదుగుతున్నట్లుగానో
ఎలాగైనా సరే గుండెలో పువ్వుల్ని పెట్టుకొని నదిలో మునుగు..
.
నీవు మునగాల్సింది నీ కోసం కాదు-
నీ దేశం కోసం మునుగు... ఈ ప్రపంచం కోసం మునుగు...
పుడమి నిండా వికసించాలని నదిని కోరుకుంటూ మునుగు...
అదీ పుష్కర స్నాన మంటే... అదే ముష్కర హనన మంటే...
మనిషివై
నదిలో మునిగా వనుకో,
మనసు చుట్టూ సహజంగా ఉన్న ఓజోనుకు
మనుషులు చేసిన కన్నాలు పూడిపోవాలి,
ఊపిరాడకుండా బతుకుల మీద చుట్టుకొన్న
రంగురంగుల లోహాల పొరలు వూడిపోవాలి...
మనసు చుట్టూ సహజంగా ఉన్న ఓజోనుకు
మనుషులు చేసిన కన్నాలు పూడిపోవాలి,
ఊపిరాడకుండా బతుకుల మీద చుట్టుకొన్న
రంగురంగుల లోహాల పొరలు వూడిపోవాలి...
నిరంతరం
నిద్రపోతున్న మనల్ని సదా ప్రేమించే
నది చేతుల్ని కాసేపయినా స్పృహతో తాకి దోసిలిపట్టాలి,
మనలో ఇంకా ఏదో పచ్చని వెలుతురు
తచ్చాడుతూనే వుందనే వెచ్చని నిజాన్ని కనిపెట్టాలి...
నది చేతుల్ని కాసేపయినా స్పృహతో తాకి దోసిలిపట్టాలి,
మనలో ఇంకా ఏదో పచ్చని వెలుతురు
తచ్చాడుతూనే వుందనే వెచ్చని నిజాన్ని కనిపెట్టాలి...
నది
నేలమీదే పయనిస్తున్నా –
నది నడకలో ఉన్నత గిరి శిఖరాలు,
నది సుస్వర శాంత శబ్దాలు చేస్తున్నా-
కరువుమీద కోప్పడే ఉగ్ర గంభీర స్వరాలు...
నది నడకలో ఉన్నత గిరి శిఖరాలు,
నది సుస్వర శాంత శబ్దాలు చేస్తున్నా-
కరువుమీద కోప్పడే ఉగ్ర గంభీర స్వరాలు...
నదీ
జలాలు మన కాళ్ళ చుట్టూ తిరిగే
మన పెంపుడు కుక్క పిల్లలు కావు,
మనం పట్టించుకొనకపోయినా మన చుట్టూనే తిరుగుతూ
మనల్ని సుఖపెడుతున్న అవిశ్రాంత విద్యుద్వలయాలు...
మన పెంపుడు కుక్క పిల్లలు కావు,
మనం పట్టించుకొనకపోయినా మన చుట్టూనే తిరుగుతూ
మనల్ని సుఖపెడుతున్న అవిశ్రాంత విద్యుద్వలయాలు...
చైతన్యం
ధరించిన నది ఒక సూర్యుడు,
చల్లదనం ప్రసరించే నది ఒక చంద్రుడు,
సంస్కారంతో నదికి నమస్కరించేవాడు
ఒక సూర్యు డవుతాడు, ఒక చంద్రు డవుతాడు,
సూర్యచంద్రుల్ని మించిన ఓ మహాగోళ తేజ మవుతాడు...
చల్లదనం ప్రసరించే నది ఒక చంద్రుడు,
సంస్కారంతో నదికి నమస్కరించేవాడు
ఒక సూర్యు డవుతాడు, ఒక చంద్రు డవుతాడు,
సూర్యచంద్రుల్ని మించిన ఓ మహాగోళ తేజ మవుతాడు...
నదిలో
నీరు -
రైతు కన్నీరని ఎవరన్నారు-
రైతుల్ని చూసి
నదే కన్నీరు పెడుతోంది...
రైతు కన్నీరని ఎవరన్నారు-
రైతుల్ని చూసి
నదే కన్నీరు పెడుతోంది...
కాలాల్ని
బట్టి నదికి - పాలెండిపోవచ్చు,
వక్షస్థలం ఎండిపోవచ్చు, దేహమే ఎండిపోవచ్చు...
మనిషి ఎండిపోకూడదు - మనిషిలో నది ప్రవహిస్తూనే ఉండాలి,
పుడమికి రకరకాల రంగుల చీరలు కట్టబెడుతూనే వుండాలి.
వక్షస్థలం ఎండిపోవచ్చు, దేహమే ఎండిపోవచ్చు...
మనిషి ఎండిపోకూడదు - మనిషిలో నది ప్రవహిస్తూనే ఉండాలి,
పుడమికి రకరకాల రంగుల చీరలు కట్టబెడుతూనే వుండాలి.
ఒక్క
మాట చెప్పనా-
నది అంటే భూమి కాగితం మీద
ఆకాశం కవి రాసిన ఓ కమ్మని కవిత్వం,
అది చదువుతున్నాం కాబట్టే మన మింకా బతికే వున్నాం.
వేలెత్తి చూపాల్సిందే
నది అంటే భూమి కాగితం మీద
ఆకాశం కవి రాసిన ఓ కమ్మని కవిత్వం,
అది చదువుతున్నాం కాబట్టే మన మింకా బతికే వున్నాం.
వేలెత్తి చూపాల్సిందే
వేలెత్తి
చూపాలంటే
వేల కొలది గుండె లుండాలి,
అంబేద్కరులా
దండిగా పుస్తకాలు చదివుండాలి...
వేల కొలది గుండె లుండాలి,
అంబేద్కరులా
దండిగా పుస్తకాలు చదివుండాలి...
సొంత
గుండె కేసి
వేలెత్తి చూపించాల్సిన అవసరం లేని వాడే
ఇతరుల గుండె కేసి వేలెత్తి చూపాలి...
వేలుంది కదా అని
సూర్యుడికి వేలెత్తి చూపకు...
వేలే మిగలదు...
వేలెత్తి చూపించాల్సిన అవసరం లేని వాడే
ఇతరుల గుండె కేసి వేలెత్తి చూపాలి...
వేలుంది కదా అని
సూర్యుడికి వేలెత్తి చూపకు...
వేలే మిగలదు...
నువ్వు
వేలెత్తి చూపాలంటే
చంద్రుడికి చూపించు- వాడిలో మచ్చ లున్నాయని...
తప్పు లేదు...
లేని మచ్చల్ని వీలెత్తి చూపకు-
చరిత్ర పేజీలలో నువ్వే చెరపలేని ఓ మహా మచ్చ వౌతావు,
చంద్రుడికి చూపించు- వాడిలో మచ్చ లున్నాయని...
తప్పు లేదు...
లేని మచ్చల్ని వీలెత్తి చూపకు-
చరిత్ర పేజీలలో నువ్వే చెరపలేని ఓ మహా మచ్చ వౌతావు,
ఏ
కరకు కసాయి ఆయుధా లవసరం లేదు-
చీకట్లకు వేలెత్తి చూపిస్తే చాలు
కూకటి వేళ్ళతో సహా అవే పెకలించబడతాయి,
ప్రస్తుతం దేశం చెడిపోయిం దెందుకు!
నిజమైన వేలెత్తి చూపేవారు లేరు...
చీకట్లకు వేలెత్తి చూపిస్తే చాలు
కూకటి వేళ్ళతో సహా అవే పెకలించబడతాయి,
ప్రస్తుతం దేశం చెడిపోయిం దెందుకు!
నిజమైన వేలెత్తి చూపేవారు లేరు...
వేలెత్తి
చూపితే పదవులు రాకపోవచ్చు కాని
జనం పెదవులు నీ కోసం ప్రార్ధిస్తాయి,
కుర్చీలు దూరంగా జరిగిపోతే పోనీ
ప్రజా హృదయ సింహాసనాలు నిన్ను రమ్మని అర్ధిస్తాయి...
జనం పెదవులు నీ కోసం ప్రార్ధిస్తాయి,
కుర్చీలు దూరంగా జరిగిపోతే పోనీ
ప్రజా హృదయ సింహాసనాలు నిన్ను రమ్మని అర్ధిస్తాయి...
వేలెత్తి
చూపేముందు
నీ వేలిలో రక్తం ఉందో విషం ఉందో చూసుకో,
వేలెత్తి నీవు ఆయుధం గుచ్చబోయే ముందు
బురదో దురదో నీ మనసులో ఏముందో తెలుసుకో...
నీ వేలిలో రక్తం ఉందో విషం ఉందో చూసుకో,
వేలెత్తి నీవు ఆయుధం గుచ్చబోయే ముందు
బురదో దురదో నీ మనసులో ఏముందో తెలుసుకో...
దేశంలో
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ
వేలెత్తి చూపగలిగిన వాళ్ళు కొందరే,
మురికికి వేలెత్తి చూపకపొతే
ఎవడైనా మురికైపోతాడు...
నిజమే కాని-
చీకటిని కడుపులో దాచుకొని
వెలుతురుకు వేలెత్తి చూపేవాళ్ళకు కూడా
వేలెత్తి చూపగలిగే మహాజ్యోతి అంబేద్కరుడే.
వేలెత్తి చూపగలిగిన వాళ్ళు కొందరే,
మురికికి వేలెత్తి చూపకపొతే
ఎవడైనా మురికైపోతాడు...
నిజమే కాని-
చీకటిని కడుపులో దాచుకొని
వెలుతురుకు వేలెత్తి చూపేవాళ్ళకు కూడా
వేలెత్తి చూపగలిగే మహాజ్యోతి అంబేద్కరుడే.
వేలెత్తి
చూపట మంటే
విమర్శించటంతో పాటు
విప్లవ పథం చూపించటం కూడా.
విమర్శించటంతో పాటు
విప్లవ పథం చూపించటం కూడా.
డాక్టరు-
ట్రాక్టరు
ఆనందాన్ని
అందించే యాక్టరుకన్నా,
సినిమా డైరెక్టరు కన్నా
ఆనందానుభవానికి అవసరమైన
ఆరోగ్యం అందించే డాక్టరు గొప్పవాడు...
సినిమా డైరెక్టరు కన్నా
ఆనందానుభవానికి అవసరమైన
ఆరోగ్యం అందించే డాక్టరు గొప్పవాడు...
ఆదాయం
కన్నా వ్యవ”సాయం”
ముఖ్యంగా బతికే
రైతులాంటివాడు డాక్టరు...
అవసరమైనప్పుడు పొలానికి ఆపరేషన్ చేసి
పంటల్ని పండించే ట్రాక్టరులాంటిది డాక్టరు చేతిలో పట్టా...
రైతులాంటివాడు డాక్టరు...
అవసరమైనప్పుడు పొలానికి ఆపరేషన్ చేసి
పంటల్ని పండించే ట్రాక్టరులాంటిది డాక్టరు చేతిలో పట్టా...
పంటకు
తెగులు సోకితే బాగు చేసే మందు కొట్టాలి కాని
పొల మంతా తెగులు సోకి నేలే నాశనమై పోతుందని భయపెడితే ఎలా...
పంటను మొత్తం పీకి తక్షణమే కొత్త పంట వేయాలని హడలగొడితే ఎలా...
ట్రాక్టరుకు చేసిన అప్పు క్షణాల్లో తీరిపోవాలని
పండుతున్న పచ్చని పొలాలన్నీ దున్ని తీరా లంటే ఎలా...
పొల మంతా తెగులు సోకి నేలే నాశనమై పోతుందని భయపెడితే ఎలా...
పంటను మొత్తం పీకి తక్షణమే కొత్త పంట వేయాలని హడలగొడితే ఎలా...
ట్రాక్టరుకు చేసిన అప్పు క్షణాల్లో తీరిపోవాలని
పండుతున్న పచ్చని పొలాలన్నీ దున్ని తీరా లంటే ఎలా...
డాక్టరుకు
మెడలోది స్టెతస్కోపు కాదు-
డాక్టరును అభినందిస్తూ ఆరోగ్య దేవత వేసిన పూల మాల!
డాక్టరు వేసుకొన్నది శ్వేతాంబరం కాదు-
ఆరోగ్య దేవతా వ్రతం కోసం ధరించిన దీక్షా కవచం!
ప్రాణాలు పట్టుకెళ్ళటాని కొస్తున్న యముడిని దూరంగా నిలబెట్టి
వెనక్కి పంపించగల మహా పరమేశ్వరుడు డాక్టరు...
భక్తుల నైవేద్యాలవల్ల దేవతల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నదట!
నిజాయితీ సేవ లందించే డాక్టర్లముందు క్యూలో నిలబడటానికి
దేవతలు కూడా కొట్టుకుంటున్నారు!
డాక్టరును అభినందిస్తూ ఆరోగ్య దేవత వేసిన పూల మాల!
డాక్టరు వేసుకొన్నది శ్వేతాంబరం కాదు-
ఆరోగ్య దేవతా వ్రతం కోసం ధరించిన దీక్షా కవచం!
ప్రాణాలు పట్టుకెళ్ళటాని కొస్తున్న యముడిని దూరంగా నిలబెట్టి
వెనక్కి పంపించగల మహా పరమేశ్వరుడు డాక్టరు...
భక్తుల నైవేద్యాలవల్ల దేవతల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నదట!
నిజాయితీ సేవ లందించే డాక్టర్లముందు క్యూలో నిలబడటానికి
దేవతలు కూడా కొట్టుకుంటున్నారు!
డాక్టర్లు
భవనాలు కట్టాల్సింది
మృత్యు శీతల స్పర్శ పచ్చ నోట్ల “పేమెంటు:తో కాదు-
జీవన మాధుర్యం నిండిన రోగుల విశ్వాసం గట్టి “సిమెంటు”తో...
డాక్టరుగారి కుటుంబ ఆనంద క్షణాల చిరునామా తెలుసా!
రోగుల దేవతలకు డాక్టరు అందించే నిష్కామ వైద్య నైవేద్యంలోనే,
నిర్మల మనసుతో చేసే నిరంతర భక్తి భావ కైంకర్యంలోనే...
మృత్యు శీతల స్పర్శ పచ్చ నోట్ల “పేమెంటు:తో కాదు-
జీవన మాధుర్యం నిండిన రోగుల విశ్వాసం గట్టి “సిమెంటు”తో...
డాక్టరుగారి కుటుంబ ఆనంద క్షణాల చిరునామా తెలుసా!
రోగుల దేవతలకు డాక్టరు అందించే నిష్కామ వైద్య నైవేద్యంలోనే,
నిర్మల మనసుతో చేసే నిరంతర భక్తి భావ కైంకర్యంలోనే...
చొక్కా
చొక్కాను
అదే పనిగా తడపకు,
మాటిమాటికీ పిండకు,
తొడుక్కోలేవు...
అదే పనిగా తడపకు,
మాటిమాటికీ పిండకు,
తొడుక్కోలేవు...
ఏ
చెమటతోనో
ఏ దుమ్ముతోనో
నిదానంగా మురికిపడుతుంటే
చక్కగా ఉతుక్కో,
ధైర్యంగా ఆరబెట్టుకో,
హుందాగా ధరించవచ్చు...
ఏ దుమ్ముతోనో
నిదానంగా మురికిపడుతుంటే
చక్కగా ఉతుక్కో,
ధైర్యంగా ఆరబెట్టుకో,
హుందాగా ధరించవచ్చు...
మనస్సు
జీవితానికి తొడిగే చొక్కా లాంటిది.
జీవితానికి తొడిగే చొక్కా లాంటిది.
నిజాల
కలాలను కాలుస్తారా!
దేశాన్ని
తినీ తినీ
తుపాకీకి దాహం వేసింది,
కాసిని మంచి నీళ్ళిస్తారా అని అడిగింది,
పంచ ప్రాణాల్ని మంచి నీళ్ళలా తాగేసింది.
తుపాకీకి దాహం వేసింది,
కాసిని మంచి నీళ్ళిస్తారా అని అడిగింది,
పంచ ప్రాణాల్ని మంచి నీళ్ళలా తాగేసింది.
గాలిని
కత్తితో కోయటానికి
నీటిని గొడ్డలితో నరకటానికి
ఆకాశాన్ని క్షిపణితో నేల కూల్చటానికి
అగ్నిని బాంబుతో పేల్చటానికి
భూమిని తుపాకీతో కాల్చటానికి
వారు అనుక్షణం సంసిద్ధం,
నిరంతరం భయపడుతూ బతికేవారు
అదేపనిగా చేస్తుంటారు యుద్ధం...
నీటిని గొడ్డలితో నరకటానికి
ఆకాశాన్ని క్షిపణితో నేల కూల్చటానికి
అగ్నిని బాంబుతో పేల్చటానికి
భూమిని తుపాకీతో కాల్చటానికి
వారు అనుక్షణం సంసిద్ధం,
నిరంతరం భయపడుతూ బతికేవారు
అదేపనిగా చేస్తుంటారు యుద్ధం...
మీరు
గురిపెట్టింది ఒక కలానికి కాదు-
ఒక దివ్య అక్షర యుక్తికి,
పంచభూత మహా నిశ్శబ్ద శక్తికి...
మీరు కాల్చింది ఒక్క బెంగుళూరులో ఆ ఇంటి ముందు కాదు-
దేశం కళ్ళముందు చంపారు,
కోట్ల ప్రజల గుండెల్లో గుండ్లు దింపారు...
ఒక సునామీ, ఒక భూకంపం తప్పదు,
సమయం వస్తుంది, ఆ సమయం వస్తుంది.
ఒక దివ్య అక్షర యుక్తికి,
పంచభూత మహా నిశ్శబ్ద శక్తికి...
మీరు కాల్చింది ఒక్క బెంగుళూరులో ఆ ఇంటి ముందు కాదు-
దేశం కళ్ళముందు చంపారు,
కోట్ల ప్రజల గుండెల్లో గుండ్లు దింపారు...
ఒక సునామీ, ఒక భూకంపం తప్పదు,
సమయం వస్తుంది, ఆ సమయం వస్తుంది.
జాతి
జల ప్రవాహంలో పెరుగుతున్న మురికిని
బయటకు లాగి రోడ్డు మీద పడేస్తున్న కలం అది,
దేశం నరాల్లో గడ్డకట్టి బలిసిన చీకటిని
క్రమక్రమంగా కరిగిస్తున్న దివ్యౌషధ గళం అది,
దేశం గడపలో ఒక కలాన్ని
చంపామని మీ రనుకొంటున్నారు కాని
ప్రజల మనస్సుల్లో మీరు ఒకేసారి కోటిసార్లు చచ్చారని తెలుసుకోండి...
బయటకు లాగి రోడ్డు మీద పడేస్తున్న కలం అది,
దేశం నరాల్లో గడ్డకట్టి బలిసిన చీకటిని
క్రమక్రమంగా కరిగిస్తున్న దివ్యౌషధ గళం అది,
దేశం గడపలో ఒక కలాన్ని
చంపామని మీ రనుకొంటున్నారు కాని
ప్రజల మనస్సుల్లో మీరు ఒకేసారి కోటిసార్లు చచ్చారని తెలుసుకోండి...
మీరు
నోరు మూయించా మనుకుంటారు కాని
ఇప్పటికే వెలువడిన మాటలు మిమ్మల్ని వదలవు,
పంచ భూతాలతో కలిసి ప్రయాణిస్తూ
మీ బాంబుల కన్నాబలపడుతూ మీ కోటల్ని కూలుస్తాయి...
సమయం రావాలి, ఆ సమయం రావాలి...
ఇప్పటికే వెలువడిన మాటలు మిమ్మల్ని వదలవు,
పంచ భూతాలతో కలిసి ప్రయాణిస్తూ
మీ బాంబుల కన్నాబలపడుతూ మీ కోటల్ని కూలుస్తాయి...
సమయం రావాలి, ఆ సమయం రావాలి...
కలాన్ని
కాల్చట మంటే
అమ్మ లాంటి పంటచేనుమీద మంట పెట్టినట్లే
కమ్మగా వండుకున్న అన్నంకుండలో విషం పోసినట్లే...
కలం అంటే-
నిప్పుల వాగులో ఈదుతూ
పరిమళాలు పంచే పుష్పం...
పరిమళాల పూలతోటలో విహరిస్తూ
బురదను ఎండగట్టే వడగాలుల్ని విసిరే సూర్య బింబం..
అమ్మ లాంటి పంటచేనుమీద మంట పెట్టినట్లే
కమ్మగా వండుకున్న అన్నంకుండలో విషం పోసినట్లే...
కలం అంటే-
నిప్పుల వాగులో ఈదుతూ
పరిమళాలు పంచే పుష్పం...
పరిమళాల పూలతోటలో విహరిస్తూ
బురదను ఎండగట్టే వడగాలుల్ని విసిరే సూర్య బింబం..
పువ్వులతో
పెట్టుకోకండి
కోపం వస్తే పరిమళాల బాంబు లేస్తుంది,
కోపం వస్తే పరిమళాల బాంబు లేస్తుంది,
దివ్వెలతో
పెట్టుకోకండి,
నిద్ర పోతున్న బాంబుల్ని అంటిస్తుంది,
అక్షరంతో పెట్టుకోకండి,
బాంబుల్ని తయారు చేసి మీ ఆక్సిజన్ లాగేస్తుంది...
నిద్ర పోతున్న బాంబుల్ని అంటిస్తుంది,
అక్షరంతో పెట్టుకోకండి,
బాంబుల్ని తయారు చేసి మీ ఆక్సిజన్ లాగేస్తుంది...
కలం
మీద దాడి చేయటం అంటే
పొయ్యి మీద కాగుతున్న నూనెలో కాసిని నీళ్ళు పోయటం,
ఎగిసిపడే మంటల్లో మిమ్మల్ని మీరే కాల్చుకోవటం...
బతకటం చేతకాని వాడే నిజాన్ని చంపాలని చూస్తాడు,
చరిత్రలో చచ్చే దెపుడూ సత్యాన్ని చంపాలని యత్నించేవాడే...
ప్రసన్న మేఘం లాంటి ధైర్యం మీద కాల్చారు,
రేపు మహా కుంభవృష్టితో వాయుగుండం ప్రారంభం,
పునాదులు లేని మీ బతుకులకు పెనుగండం...
సమయం దగ్గరలోనే, ఆ సమయం దగ్గరలోనే.
పొయ్యి మీద కాగుతున్న నూనెలో కాసిని నీళ్ళు పోయటం,
ఎగిసిపడే మంటల్లో మిమ్మల్ని మీరే కాల్చుకోవటం...
బతకటం చేతకాని వాడే నిజాన్ని చంపాలని చూస్తాడు,
చరిత్రలో చచ్చే దెపుడూ సత్యాన్ని చంపాలని యత్నించేవాడే...
ప్రసన్న మేఘం లాంటి ధైర్యం మీద కాల్చారు,
రేపు మహా కుంభవృష్టితో వాయుగుండం ప్రారంభం,
పునాదులు లేని మీ బతుకులకు పెనుగండం...
సమయం దగ్గరలోనే, ఆ సమయం దగ్గరలోనే.
ప్రాణ
మూలాలను పెంచుతున్న, పచ్చదనాన్ని
పంచుతున్న
చెట్లను కాల్చేసిన ద్రోహుల్లారా,
బాంబులు పడ్డ చోటే చెట్లు తలెత్తుకొని నిలుస్తాయి...
ఆయుధాల నెదిరించి కొత్త చిగుళ్ళు గెలుస్తాయి...
ఎక్కడ కలం దేహం నేలమీద పడుతుందో
అక్కడ నెత్తురు విత్తనాలు పడతాయి,
అద్భుత బ్రహ్మాస్త్రాలు పుడతాయి...
సమయం వచ్చేస్తోంది, ఆ సమయం వచ్చేస్తోంది...
చెట్లను కాల్చేసిన ద్రోహుల్లారా,
బాంబులు పడ్డ చోటే చెట్లు తలెత్తుకొని నిలుస్తాయి...
ఆయుధాల నెదిరించి కొత్త చిగుళ్ళు గెలుస్తాయి...
ఎక్కడ కలం దేహం నేలమీద పడుతుందో
అక్కడ నెత్తురు విత్తనాలు పడతాయి,
అద్భుత బ్రహ్మాస్త్రాలు పుడతాయి...
సమయం వచ్చేస్తోంది, ఆ సమయం వచ్చేస్తోంది...
వెలుతురు
సిరా నింపుకున్న కలాలు చిరంజీవులు
దేశం పొలంలో నిజాల నాగళ్ళతో దున్నే గళాలు మహానుభావులు.
దేశం పొలంలో నిజాల నాగళ్ళతో దున్నే గళాలు మహానుభావులు.
దుర్ముఖీ, నీది మంచి ముఖమే...
ధర్మారావులు ధర్మం చేయడం లేదు,
సత్యారావులు సత్యం చెప్పడం లేదు...
దుర్ముఖి నామ వత్సరమా,
అందుకే నీ పేరు చూసి మేం భయపడటం లేదు...
సత్యారావులు సత్యం చెప్పడం లేదు...
దుర్ముఖి నామ వత్సరమా,
అందుకే నీ పేరు చూసి మేం భయపడటం లేదు...
గతంలో నువ్వొచ్చినప్పుడే గదా
కులం నశించా లన్న అంబేద్కరును బుద్ధుడి ఒడిలోకి చేర్చావు,
మళ్ళీ ఇపుడు నువ్వొచ్చేసరికి
కులాలు నశించలేదు- ముదిరిపోయాయి,
ఉపకులాలు అంతరించలేదు- పెరిగిపోయాయి,
బుద్ధుడు మావల్ల అరిగిపోయాడు,
బుద్ధులు మా మనస్సులో కరిగిపోయాయి...
ఇప్పుడు నువ్వే భయపడతావు- మమ్మల్ని చూసి,
జాగ్రత్తగా చదువుకో- భారతదేశ గ్రంథం చెదలు పడుతోంది...
కులం నశించా లన్న అంబేద్కరును బుద్ధుడి ఒడిలోకి చేర్చావు,
మళ్ళీ ఇపుడు నువ్వొచ్చేసరికి
కులాలు నశించలేదు- ముదిరిపోయాయి,
ఉపకులాలు అంతరించలేదు- పెరిగిపోయాయి,
బుద్ధుడు మావల్ల అరిగిపోయాడు,
బుద్ధులు మా మనస్సులో కరిగిపోయాయి...
ఇప్పుడు నువ్వే భయపడతావు- మమ్మల్ని చూసి,
జాగ్రత్తగా చదువుకో- భారతదేశ గ్రంథం చెదలు పడుతోంది...
గతంలోనువ్వొచ్చినప్పుడే గదా
తెలుగువాళ్ళను ఏకం చేసి
ఒక సొంతిల్లు ఆత్మగౌరవం కట్టబెట్టావు,
మళ్ళీ ఇపుడు నువ్వొచ్చేసరికి
ఎన్నో గోడలు నిలబెట్టుకున్నాం,
మనసుల్ని చెడగొట్టుకున్నాం,
మనుషుల్ని పడగొట్టుకున్నాం...
ఇపుడు నువ్వే భయపడతావు- తెలుగువాళ్ళను చూసి,
నిన్ను ముక్కలుగా నరకొచ్చు...
జాగ్రత్తగా చూసుకో- తెలుగుభాష ఎముకలగూడు,
తేలికగా విరిగిపడొచ్చు...
తెలుగువాళ్ళను ఏకం చేసి
ఒక సొంతిల్లు ఆత్మగౌరవం కట్టబెట్టావు,
మళ్ళీ ఇపుడు నువ్వొచ్చేసరికి
ఎన్నో గోడలు నిలబెట్టుకున్నాం,
మనసుల్ని చెడగొట్టుకున్నాం,
మనుషుల్ని పడగొట్టుకున్నాం...
ఇపుడు నువ్వే భయపడతావు- తెలుగువాళ్ళను చూసి,
నిన్ను ముక్కలుగా నరకొచ్చు...
జాగ్రత్తగా చూసుకో- తెలుగుభాష ఎముకలగూడు,
తేలికగా విరిగిపడొచ్చు...
కొత్త కోరికలతో కొత్తగా మనసంతా
కొత్తగా అలంకరించుకున్న కొత్త పెళ్ళికూతురులా
కొత్త ఉగాది వస్తున్నది పచ్చదనంగా,
తెస్తున్నది కొత్త రాజధానిని విత్తనంగా...
కొత్తగా అలంకరించుకున్న కొత్త పెళ్ళికూతురులా
కొత్త ఉగాది వస్తున్నది పచ్చదనంగా,
తెస్తున్నది కొత్త రాజధానిని విత్తనంగా...
ముసలి తండ్రినుండి కొత్తగా పెత్తనం వచ్చిన
కొత్త కుర్రాడు కొనుక్కొచ్చిన కొత్త కోడెదూడల్లాగా
ఎగిరెగిరి పడుతూ ఎండలు,
మోగిస్తూ నిప్పుల మెడగంటలు...
కొత్త కుర్రాడు కొనుక్కొచ్చిన కొత్త కోడెదూడల్లాగా
ఎగిరెగిరి పడుతూ ఎండలు,
మోగిస్తూ నిప్పుల మెడగంటలు...
మహిళల మెడలనుంచి బంగారు గొలుసులు
బలవంతంగా లాక్కుపోతున్న దొంగల్లాగా
ఎక్క డెక్కడో ఇంకా మిగిలిపోయిన నీటి జాడల్ని
హరించివేస్తున్న వేడి గాలులు,
బలవంతంగా లాక్కుపోతున్న దొంగల్లాగా
ఎక్క డెక్కడో ఇంకా మిగిలిపోయిన నీటి జాడల్ని
హరించివేస్తున్న వేడి గాలులు,
పనులు చేసీ చేసీ అలిసిపోయి పంటలన్నీఇంటికి చేర్చి
ఉక్కపోతకు జడిసి పెంకుటింటి లోపలి గదిలో
ముడుచుకుపోయి కూర్చున్న ముసలిరైతుల్లా
ఎక్కడికో పోయి దాక్కుంటున్నాయి చల్లగాలులు...
ఉక్కపోతకు జడిసి పెంకుటింటి లోపలి గదిలో
ముడుచుకుపోయి కూర్చున్న ముసలిరైతుల్లా
ఎక్కడికో పోయి దాక్కుంటున్నాయి చల్లగాలులు...
ఎంత పురుష అహంకారంగా ఉన్నా సరే ఎండలు
ఎంత అధికారం చెలాయిస్తున్నట్లు ఎగిసిపడుతున్నా సరే ఎండలు
అమ్మాయిల తొలిచూపుల తొలకరి జల్లు తగిలితే చాలు-
అంతే సంగతి, చివరకు వానలదే పెత్తనం,
మగవాళ్ళ రాజ్యంగా చెప్పుకోవటమే కాని చాలా ఇళ్ళల్లో
ప్రస్తుత స్థితి , ఫైనల్ గా చానలదే పెత్తనం...
ఎంత అధికారం చెలాయిస్తున్నట్లు ఎగిసిపడుతున్నా సరే ఎండలు
అమ్మాయిల తొలిచూపుల తొలకరి జల్లు తగిలితే చాలు-
అంతే సంగతి, చివరకు వానలదే పెత్తనం,
మగవాళ్ళ రాజ్యంగా చెప్పుకోవటమే కాని చాలా ఇళ్ళల్లో
ప్రస్తుత స్థితి , ఫైనల్ గా చానలదే పెత్తనం...
ఎండలు ఎగిరెగిరిపడేది ప్రపంచ కుటుంబం కోసమే,
వెతుక్కొని వెతుక్కొని వానల్ని ఆహ్వానించటం కోసమే,
వాన లొస్తేనే ప్రకృతికి పచ్చదనం,
చాన లుంటేనే పురుషులకు పచ్చ"ధనం"...
వెతుక్కొని వెతుక్కొని వానల్ని ఆహ్వానించటం కోసమే,
వాన లొస్తేనే ప్రకృతికి పచ్చదనం,
చాన లుంటేనే పురుషులకు పచ్చ"ధనం"...
దుర్ముఖీ...రా...
సుముఖంగా రా...
నువ్వొస్తేనే వసంతం వచ్చేది,
వసంతం వస్తేనే ఎండలు మల్లెలు మామిడిపండ్లు వచ్చేది,
ఇవన్నీ వస్తేనే కోకిల వచ్చేది,
కోకిల వస్తేనే ప్రభుత్వం కవిసమ్మేళనం పెట్టేది,
కవిసమ్మేళనం వింటేనే
తెలుగు జనం మత్తు వదిలేది...
దుర్ముఖీ, నీది మంచి ముఖమే,
మాకు నీవు పంచేది అనంత సుఖమే.
సుముఖంగా రా...
నువ్వొస్తేనే వసంతం వచ్చేది,
వసంతం వస్తేనే ఎండలు మల్లెలు మామిడిపండ్లు వచ్చేది,
ఇవన్నీ వస్తేనే కోకిల వచ్చేది,
కోకిల వస్తేనే ప్రభుత్వం కవిసమ్మేళనం పెట్టేది,
కవిసమ్మేళనం వింటేనే
తెలుగు జనం మత్తు వదిలేది...
దుర్ముఖీ, నీది మంచి ముఖమే,
మాకు నీవు పంచేది అనంత సుఖమే.
కాలం
మన లీడర్
కాలానికి
30 అంకెలే వచ్చు
అందుకే నెలకు 30 రోజులు...
అందుకే నెలకు 30 రోజులు...
కాలానికి
12 ఎక్కాలే
వచ్చు
అందుకే సంవత్సరానికి 12 నెలలు...
అందుకే సంవత్సరానికి 12 నెలలు...
కాలానికి
ఆయుష్షు 60 ఏళ్లు
అందుకే కాలానికి పునర్జన్మ...
అందుకే కాలానికి పునర్జన్మ...
పగలు
ఎండ చొక్కా తొడుక్కుని
రాత్రి వెన్నెల చొక్కా వేసుకొని
సాగిపోతూ కాలం
కొన్ని సార్లు చీకటి బట్టలేసుకొంటూ...
రాత్రి వెన్నెల చొక్కా వేసుకొని
సాగిపోతూ కాలం
కొన్ని సార్లు చీకటి బట్టలేసుకొంటూ...
కాలానికి
చదువు రాకపోతేనేం...
మహా తెలివిగా మంత్రిగా
మన మీదెక్కి తొక్కుతూ
తన మాటే మన మీద బలంగా నొక్కుతూ...
చదువు రాకపోతేనేం...
మహా తెలివిగా మంత్రిగా
మన మీదెక్కి తొక్కుతూ
తన మాటే మన మీద బలంగా నొక్కుతూ...
కాలం
పుట్టిం దెపుడో తెలియదు
అందుకే జనవరి 1 అని స్కూలు రికార్డులో రాశారు
కాలానికి ఈరోజు శుభాకాంక్షలు చెబుదాం
కాలంలో బతుకుతున్న మనం కూడా
శుభాకాంక్షలు చెప్పుకుందాం.
అందుకే జనవరి 1 అని స్కూలు రికార్డులో రాశారు
కాలానికి ఈరోజు శుభాకాంక్షలు చెబుదాం
కాలంలో బతుకుతున్న మనం కూడా
శుభాకాంక్షలు చెప్పుకుందాం.
తోట
విందులు
తింటే
శరీరానికి బలం,
కలిసి తింటే
మనసుకు కూడా బలం...
శరీరానికి బలం,
కలిసి తింటే
మనసుకు కూడా బలం...
మల్లె
లన్నీ ఒకే దండగా వెళ్లి
కలిసి తింటున్నాయి,
మల్లెల మనసులకు బలమే...
కలిసి తింటున్నాయి,
మల్లెల మనసులకు బలమే...
గులాబీ
లన్నీ ఒకే గంపగా వెళ్లి
కలిసి తింటున్నాయి,
గులాబీ మనసులకు బలమే...
కలిసి తింటున్నాయి,
గులాబీ మనసులకు బలమే...
మందారా
లన్నీ ఒకే పూల బుట్టగా వెళ్లి
కలిసి తింటున్నాయి,
మందారాల మనసులకు బలమే...
కలిసి తింటున్నాయి,
మందారాల మనసులకు బలమే...
అలోచించి
చూడండి-
వివిధ వర్ణాల పూలు ఒకే శక్తిగా
రకరకాల పరిమళాలు ఒకే రక్తిగా
కలిసి తింటే
శరీరానికి, మనసులకు మాత్రమే కాదు...
దేశానికి, ప్రపంచానికి, విశ్వానికి కూడా మహా బలం...
వివిధ వర్ణాల పూలు ఒకే శక్తిగా
రకరకాల పరిమళాలు ఒకే రక్తిగా
కలిసి తింటే
శరీరానికి, మనసులకు మాత్రమే కాదు...
దేశానికి, ప్రపంచానికి, విశ్వానికి కూడా మహా బలం...
తోట
విందులకు రుచి లేదు ఏక వర్ణ మూలకంగా...
తోట పాటవుతుంది అనేక వర్ణ సమ్మేళనంగా....
తోట పాటవుతుంది అనేక వర్ణ సమ్మేళనంగా....
వెలుతురు
ఇక చాలు!
చీకటిలో
వెలుతురు తెచ్చినవాడా,
నా కన్నులు కనిపిస్తున్నాయి,,,
వెలుతురు తెచ్చినవాడా,
నా కన్నులు కనిపిస్తున్నాయి,,,
వెలుతురులో
మనోహరమైన రంగురంగులు కనిపెట్టినవాడా,
నా కన్నులు పరవశిస్తున్నాయి...
మనోహరమైన రంగురంగులు కనిపెట్టినవాడా,
నా కన్నులు పరవశిస్తున్నాయి...
వివిధ
వర్ణ సమూహాల్లో
ప్రజ్జ్వల ఉష్ణ కాంతులు పెంచుతున్నవాడా,
నా కన్నులు బైర్లు కమ్ముతున్నాయి...
ప్రజ్జ్వల ఉష్ణ కాంతులు పెంచుతున్నవాడా,
నా కన్నులు బైర్లు కమ్ముతున్నాయి...
ఇప్పటికి
నీవు సృజించిన వెలుతురు
ఒక్క చోటనే బంధించకు,
ప్రపంచ మంతా పంచు,
చీకటి మూల లన్నిటికీ ఆనందం నించు...
ఒక్క చోటనే బంధించకు,
ప్రపంచ మంతా పంచు,
చీకటి మూల లన్నిటికీ ఆనందం నించు...
వెలుతురు
కింకా ఏవో ఏవేవో
మంటల పరిశోదనలు చేస్తున్నవాడా...
నీకు పుణ్యం ఉంటుంది...
విశ్వం కన్నుల బల్బులు మాడిపోతాయి...
జాగ్రత్త!
మంటల పరిశోదనలు చేస్తున్నవాడా...
నీకు పుణ్యం ఉంటుంది...
విశ్వం కన్నుల బల్బులు మాడిపోతాయి...
జాగ్రత్త!
రాజకీయం
మనల్ని
కోసేస్తున్నా
మన తలల్ని తినేస్తున్నా
నొప్పి లేని మందేదో
వాడు కనిపెట్టాడు...
మన తలల్ని తినేస్తున్నా
నొప్పి లేని మందేదో
వాడు కనిపెట్టాడు...
అందుకే
వాడు విదిలించిన
ఎంగిలి మెతుకులు మాత్రమే
మనకు కనిపిస్తున్నాయి.
వాడు విదిలించిన
ఎంగిలి మెతుకులు మాత్రమే
మనకు కనిపిస్తున్నాయి.
ఎప్పటి
కప్పుడే...
చీమలు
కష్టపడి
పుట్టలు కడతాయి,
పాము లాక్రమిస్తాయి...
పుట్టలు కడతాయి,
పాము లాక్రమిస్తాయి...
తేనెతీగలు
శ్రమించి
తుట్టెలు పెడతాయి,
మనుషులు పిండుకుంటారు...
తుట్టెలు పెడతాయి,
మనుషులు పిండుకుంటారు...
చెట్టు
చూడు-
తన చాకిరీ పండు నిండగానే
అపటికప్పుడే తనే ఇచ్చేస్తుంది,
మళ్ళీ వెంటనే
మరో పండు నింపే పనిలో...
తన చాకిరీ పండు నిండగానే
అపటికప్పుడే తనే ఇచ్చేస్తుంది,
మళ్ళీ వెంటనే
మరో పండు నింపే పనిలో...
రోడ్డు
నరకం
రోడ్డు
కెంత బాధో
నిరంతరం రేగుతున్న గాయాలతో...
నిరంతరం రేగుతున్న గాయాలతో...
మంచి
నీటి పైపుల నరాల కోసమని
ఒక భుజాన్ని కోస్తుంటారు...
టెలిఫోన్ వైరు నాడుల కోసమని
మరో భుజాన్ని నరుకుతుంటారు...
ఒక భుజాన్ని కోస్తుంటారు...
టెలిఫోన్ వైరు నాడుల కోసమని
మరో భుజాన్ని నరుకుతుంటారు...
సెంట్రల్
డ్రైనేజీ గర్భగుడి దారి కొత్తగా వేస్తున్నా రట!
రోడ్డు దేహం మధ్యలో
గుండెలోంచి తవ్వుకుంటూ పోతున్నారు...
రోడ్డు దేహం మధ్యలో
గుండెలోంచి తవ్వుకుంటూ పోతున్నారు...
తాను
నలిగిపోతున్నా
నలుగిరికీ ఉపయోగపడుతున్నందుకు
రోడ్డుకు సంతోషమే కాని
చేస్తున్న కొత్త కొత్త గాయాలకు
కుట్లు వేయటం లేదు, కట్లు కట్టటం లేదు...
నలుగిరికీ ఉపయోగపడుతున్నందుకు
రోడ్డుకు సంతోషమే కాని
చేస్తున్న కొత్త కొత్త గాయాలకు
కుట్లు వేయటం లేదు, కట్లు కట్టటం లేదు...
ఇంత
బాధలో ఉంటే...
కార్పొరేట్ డాక్టర్లలా మళ్ళీ ఆ కాంట్రాక్టర్లే వస్తారు
రోడ్డు చర్మం పాడయిందని,
కొత్త చర్మం తొడగాలని...
కార్పొరేట్ డాక్టర్లలా మళ్ళీ ఆ కాంట్రాక్టర్లే వస్తారు
రోడ్డు చర్మం పాడయిందని,
కొత్త చర్మం తొడగాలని...
ఏదో
గౌరవంగా దుమ్ము దుస్తులతో
బతుకీడుస్తున్న రోడ్డుకు
కొత్త చర్మం పడగానే
ఒంట్లో ఎముకలు కూడా బయట పడతాయి...
బతుకీడుస్తున్న రోడ్డుకు
కొత్త చర్మం పడగానే
ఒంట్లో ఎముకలు కూడా బయట పడతాయి...
చావలేక
గడుపుతున్న బతుకు
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి రోడ్డు
ఖజానాకు కన్నం
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి రోడ్డు
ఖజానాకు కన్నం
ఖజానాకు
కన్నం
వేశారట!
అసలు కన్నం వేయనివి
ఏం మిగిలాయో చెప్పండి!
వేశారట!
అసలు కన్నం వేయనివి
ఏం మిగిలాయో చెప్పండి!
భూమికి,
కొండలకు,
నదులకు కన్నం వేశారు,
ప్రాణాలు దోచేస్తున్నారు...
కొండలకు,
నదులకు కన్నం వేశారు,
ప్రాణాలు దోచేస్తున్నారు...
సూర్యుడికి,
చంద్రుడికి,
నక్షత్రాలకు కన్నం వేశారు,
వెలుతురు దాచేస్తున్నారు...
చంద్రుడికి,
నక్షత్రాలకు కన్నం వేశారు,
వెలుతురు దాచేస్తున్నారు...
దేశానికీ,
రాజ్యానికి,
రాజ్యాంగానికి కన్నం వేశారు,
మూలాలు పీకేస్తున్నారు...
రాజ్యానికి,
రాజ్యాంగానికి కన్నం వేశారు,
మూలాలు పీకేస్తున్నారు...
మనుషులకు
మనసులకు
బంధాలకు కన్నం వేశారు,
మమతలు లాగేస్తున్నారు...
మనసులకు
బంధాలకు కన్నం వేశారు,
మమతలు లాగేస్తున్నారు...
మనకు
అన్నం
పెడుతున్నట్లే పెడుతూ
ఖజానాకు ఆవల పెద్ద కన్నం పెట్టి
వాళ్ళు సర్వం దగా చేస్తున్నారు,
వాళ్ళను చూసి వీళ్ళెవరో
ఖజానాకు ఈవల చిన్న కన్నం పెట్టి
అందితే సొంతం చేసుకుంటున్నారు...
పెడుతున్నట్లే పెడుతూ
ఖజానాకు ఆవల పెద్ద కన్నం పెట్టి
వాళ్ళు సర్వం దగా చేస్తున్నారు,
వాళ్ళను చూసి వీళ్ళెవరో
ఖజానాకు ఈవల చిన్న కన్నం పెట్టి
అందితే సొంతం చేసుకుంటున్నారు...
మనకు
కన్నాలు
పెడుతున్న మహా కళాకారులకు
మనం కన్నం పెట్టకపోతే
మనకు రేపు మిగిలేది కన్నాలే,
మన బతుకుల్లో గుండు సున్నాలే.
పెడుతున్న మహా కళాకారులకు
మనం కన్నం పెట్టకపోతే
మనకు రేపు మిగిలేది కన్నాలే,
మన బతుకుల్లో గుండు సున్నాలే.
ఉపవాసాలు
వాడు
రోజూ
మనుషుల తలలు తరుగుతుంటాడు,
ఈ నెల హత్యలు ఆపేసి
మాంసాహారంతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
మనుషుల తలలు తరుగుతుంటాడు,
ఈ నెల హత్యలు ఆపేసి
మాంసాహారంతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
వాడు
రోజూ
మాంసం తింటుంటాడు,
ఈ నెల మాంసం ఆపేసి
శాకాహారంతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
మాంసం తింటుంటాడు,
ఈ నెల మాంసం ఆపేసి
శాకాహారంతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
వాడు
రోజూ
మధుర శాకాహార భోజనం లాగిస్తుంటాడు,
ఈ నెల భోజనం ఆపేసి
ఫలాహారాలతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
మధుర శాకాహార భోజనం లాగిస్తుంటాడు,
ఈ నెల భోజనం ఆపేసి
ఫలాహారాలతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
వాడు
రోజూ
వివిధ రస భరిత ఫలాహారాలు తింటుంటాడు,
ఈ నెల అవి ఆపేసి
పాలతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
వివిధ రస భరిత ఫలాహారాలు తింటుంటాడు,
ఈ నెల అవి ఆపేసి
పాలతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
వీడెవడో
రోజు
పాలు తాగుతుంటాడు,
ఈ నెల పాలూ ఆపేసి
నీరుతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
పాలు తాగుతుంటాడు,
ఈ నెల పాలూ ఆపేసి
నీరుతో ఉపవాసం చేస్తా నన్నాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
నాలుగు
రోజులయ్యేసరికి
వాళ్ళు బాగానే ఉన్నారు కాని
వీడు మాత్రం
ఈ లోకాన్నుంచే వెళ్ళిపోయాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
వాళ్ళు బాగానే ఉన్నారు కాని
వీడు మాత్రం
ఈ లోకాన్నుంచే వెళ్ళిపోయాడు,
దేవుడు ఒప్పుకున్నాడట!
ఎగిరిపోవటం సహజం
ఎన్ని
తలలు పూనినా
ఎన్ని వలలు పన్నినా
ఎగిరిపోవాలనుకొన్న ఏ పక్షినీ ఆపలేము
రెక్క లొచ్చాక.
ఎన్ని వలలు పన్నినా
ఎగిరిపోవాలనుకొన్న ఏ పక్షినీ ఆపలేము
రెక్క లొచ్చాక.
నీ
మాటే వినాలని నీ
బాటే సాగాలని
నీవు చూపిన గూటికే చేరాలని
నువ్వనుకుంటావు, అది నీ తప్పు కాదు...
నీవు చూపిన గూటికే చేరాలని
నువ్వనుకుంటావు, అది నీ తప్పు కాదు...
ఎందుకో
మరి-
చాలా పక్షి పిల్లలు రెక్క లొచ్చినా సరే
ఇంకా ఎగిరిపోవటం లేదు-
అదే నాకు ఆశ్చర్యం
తప్పంతా వాటిదే!
చాలా పక్షి పిల్లలు రెక్క లొచ్చినా సరే
ఇంకా ఎగిరిపోవటం లేదు-
అదే నాకు ఆశ్చర్యం
తప్పంతా వాటిదే!
రెక్క
లొచ్చాక ఎగరటం
సహజం,
ఎగిరిపోవటం సహజం,
అందుకు సిద్ధపడితే సంక్షోభంగా మారవు,
సంతోషం చంద"మామ" వవుతావు...
ఎగిరిపోవటం సహజం,
అందుకు సిద్ధపడితే సంక్షోభంగా మారవు,
సంతోషం చంద"మామ" వవుతావు...
ఈ
భువనం పూర్తిగా చీకటి నిండిన మహా భవనం,
ఎవడికి వాడే తన దిక్కేదో వెతుక్కోవాలి,
తన తలుపు తానే నిశ్శబ్దంగా తెరుచుకోవాలి,
ఎవడి గమ్యం కోసం వాడే
తగిన దారులు తెలుసుకోవాలి..
ఎవడికి వాడే తన దిక్కేదో వెతుక్కోవాలి,
తన తలుపు తానే నిశ్శబ్దంగా తెరుచుకోవాలి,
ఎవడి గమ్యం కోసం వాడే
తగిన దారులు తెలుసుకోవాలి..
"ఇగో" సర్టిఫికేట్
పెండ్లి
చూపులు
అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు
అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు
అబ్బాయిని
అమ్మాయి అడిగింది
స్టడీ సర్టిఫికేట్
హెల్త్ సర్టిఫికేట్
హస్బెండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్...
అమ్మాయి అడిగింది
స్టడీ సర్టిఫికేట్
హెల్త్ సర్టిఫికేట్
హస్బెండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్...
అమ్మాయిది
బరితెగింపు
అన్నాడు అబ్బాయి,
తన సర్టిఫికెట్స్ అన్నీ
అక్కడ పెట్టేసింది అమ్మాయి...
అన్నాడు అబ్బాయి,
తన సర్టిఫికెట్స్ అన్నీ
అక్కడ పెట్టేసింది అమ్మాయి...
అప్పటిదాకా
కంగారు పడ్డ
పెద్ద మనుషులు సర్దుకున్నారు
అబ్బాయి మాత్రం తిట్టిపోశాడు
"ఇగో" సర్టిఫికేట్ చూపించాడు.
పెద్ద మనుషులు సర్దుకున్నారు
అబ్బాయి మాత్రం తిట్టిపోశాడు
"ఇగో" సర్టిఫికేట్ చూపించాడు.
వడ్డీ
మంటల్లో మనుషులు
పొద్దున్నే
దినపత్రిక
నా మనసును చంపేసింది,
గుండెలో సముద్రాల ఘోష,
కలానికి గుర్తు రాని భాష...
నా మనసును చంపేసింది,
గుండెలో సముద్రాల ఘోష,
కలానికి గుర్తు రాని భాష...
రోడ్డు
మీద మంటల్లో
బందాడుతున్న రెండేళ్ల పసిపిల్ల,
తగలబడిపోతూ కూడా
అర్థం కాక అవాక్కయి చూస్తున్న నాలుగేళ్ల పాల బుగ్గల పాప,
ఆందోళన పడుతున్న పాతికేళ్ళ నిండు వయసు ఇల్లాలు ...
అమాంతం మంటల్లో చుట్టుకుపోయిన దృశ్యంలో
తమిళనాడు దేవుళ్ళంతా కాలిపోతున్నట్లే కనిపించింది,
ద్రావిడ రాజకీయా లన్నీ చోద్యం చూస్తూ వీడియో తీస్తున్నట్లే అనిపించింది...
బందాడుతున్న రెండేళ్ల పసిపిల్ల,
తగలబడిపోతూ కూడా
అర్థం కాక అవాక్కయి చూస్తున్న నాలుగేళ్ల పాల బుగ్గల పాప,
ఆందోళన పడుతున్న పాతికేళ్ళ నిండు వయసు ఇల్లాలు ...
అమాంతం మంటల్లో చుట్టుకుపోయిన దృశ్యంలో
తమిళనాడు దేవుళ్ళంతా కాలిపోతున్నట్లే కనిపించింది,
ద్రావిడ రాజకీయా లన్నీ చోద్యం చూస్తూ వీడియో తీస్తున్నట్లే అనిపించింది...
నిజమైన
పేదవాడు ఎవడైనా
అప్పెందుకు చేస్తాడు,
ప్రాణాలు తీయటానికొస్తున్న యముడికి
లంచ మివ్వటానికో,
ప్రాణంగా పెంచుకునే బిడ్డ కోసం
ఏ సరస్వతీదేవి పూజారికి కాన్వెంటు ఫీజు అర్పించుకోవటం కోసమో...
ప్రాణానికి ప్రాణమైన అర్థాంగికి
ఏ ప్రాణం నొప్పి తీర్చటానికో...
అప్పెందుకు చేస్తాడు,
ప్రాణాలు తీయటానికొస్తున్న యముడికి
లంచ మివ్వటానికో,
ప్రాణంగా పెంచుకునే బిడ్డ కోసం
ఏ సరస్వతీదేవి పూజారికి కాన్వెంటు ఫీజు అర్పించుకోవటం కోసమో...
ప్రాణానికి ప్రాణమైన అర్థాంగికి
ఏ ప్రాణం నొప్పి తీర్చటానికో...
అప్పిచ్చేవాడా!
తీసుకొన్నవాడి చెమట పిండేదాక
వడ్డీ వసూలు చేసుకో,
కాని వాడి రక్తాన్ని పీలిస్తే ఎట్లా....
అసలు ప్రాణాల్ని,కుటుంబాన్ని కూడా
మంటల్లోకి విసిరేస్తే ఎట్లా...
తీసుకొన్నవాడి చెమట పిండేదాక
వడ్డీ వసూలు చేసుకో,
కాని వాడి రక్తాన్ని పీలిస్తే ఎట్లా....
అసలు ప్రాణాల్ని,కుటుంబాన్ని కూడా
మంటల్లోకి విసిరేస్తే ఎట్లా...
ఆ
మంటల కంత కాల్చే గుణం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా...
కేసు పెట్టినా కదలని పోలీసుల చేతులనుంచి,
ఫిర్యాదులు చేసినా పట్టని కలెక్టరు మనసునుంచి...
ఆ వేడి మంట వాళ్ళను కాల్చేసింది,
అవినీతి వెన్నెలలో కులుకుతున్న అధికారమే దగ్గరకు రానీకుండా మాడ్చేసింది......
కేసు పెట్టినా కదలని పోలీసుల చేతులనుంచి,
ఫిర్యాదులు చేసినా పట్టని కలెక్టరు మనసునుంచి...
ఆ వేడి మంట వాళ్ళను కాల్చేసింది,
అవినీతి వెన్నెలలో కులుకుతున్న అధికారమే దగ్గరకు రానీకుండా మాడ్చేసింది......
ఎండ
నా చూపు
ముక్కులు
పగలగొట్టే
మురికి కాలువలు,
ప్రాణాలు నిలబెట్టే
కృష్ణవేణి నదులు,
రోగాలతో రొప్పుతుండే
పసిఫిక్ మహా సముద్రాలు...
మురికి కాలువలు,
ప్రాణాలు నిలబెట్టే
కృష్ణవేణి నదులు,
రోగాలతో రొప్పుతుండే
పసిఫిక్ మహా సముద్రాలు...
అన్నిటి
మీద ఒకేలా
గుండె విప్పుకొని
ప్రసరిస్తున్న ఎండ....
గుండె విప్పుకొని
ప్రసరిస్తున్న ఎండ....
అది ఎండ కాదు,
అది నేనే,
నా చూపే...
అది నేనే,
నా చూపే...
నాకు
మనసనేది
ఇంకా ఎక్కడుంది!
దాన్నెపుడో
దేశం ఆకాశంలో విసిరేసాను,
అది ఎపుడైనా
కురవటానికి సిద్ధంగా ఉన్న
నల నల్లని మేఘమే!
మనసనేది
ఇంకా ఎక్కడుంది!
దాన్నెపుడో
దేశం ఆకాశంలో విసిరేసాను,
అది ఎపుడైనా
కురవటానికి సిద్ధంగా ఉన్న
నల నల్లని మేఘమే!
దేవుడి
కన్నా బలవంతుడు
పత్రికలు కత్తులతో పొడిచాయి,
గుచ్చుకోలేదు,
విప్లవ శక్తులు తుపాకీతో కాల్చాయి
గుండు దిగలేదు,
మేథావి సమూహాలు బాంబు లేసాయి
పేలలేదు...
గుచ్చుకోలేదు,
విప్లవ శక్తులు తుపాకీతో కాల్చాయి
గుండు దిగలేదు,
మేథావి సమూహాలు బాంబు లేసాయి
పేలలేదు...
వాడు
దేవుడికన్నా శక్తివంతు డని
తోక ముడుచుకు పారిపోయాయి...
గత్యంతరం లేక దేవుణ్ణి తలచుకున్నాను
ఆయనే అసలు గుట్టు విప్పి చెప్పాడు...
తోక ముడుచుకు పారిపోయాయి...
గత్యంతరం లేక దేవుణ్ణి తలచుకున్నాను
ఆయనే అసలు గుట్టు విప్పి చెప్పాడు...
"వాడి
ప్రాణ రహస్యం నీ
చూపుడు వ్రేలులో ఉంది,
వాడి తప్పు లెత్తి చూపాలి,
బద్దకించకుండా ప్రశ్నించాలి, ఆగ్రహంతో హెచ్చరించాలి...
ఆ కర్తవ్యా లన్నీ వదిలేసావు..."
వాడి తప్పు లెత్తి చూపాలి,
బద్దకించకుండా ప్రశ్నించాలి, ఆగ్రహంతో హెచ్చరించాలి...
ఆ కర్తవ్యా లన్నీ వదిలేసావు..."
"వాడికి
ప్రాణం పోయటానికైనా తీయటానికైనా
అయిదేళ్ళ కోసారి పని చేసే అద్భుత శక్తి నీ కిస్తే
మళ్ళీ మళ్ళీ వాడికే ప్రాణం పోస్తున్నావు,
నీ కర్మను మరిచిపోయి
తలకాయ లేకుండా నన్నే తిట్టిపోస్తున్నావు"
అయిదేళ్ళ కోసారి పని చేసే అద్భుత శక్తి నీ కిస్తే
మళ్ళీ మళ్ళీ వాడికే ప్రాణం పోస్తున్నావు,
నీ కర్మను మరిచిపోయి
తలకాయ లేకుండా నన్నే తిట్టిపోస్తున్నావు"
నా
శక్తి గుర్తు కొచ్చింది,
బాగా బుద్ధొచ్చింది.
బాగా బుద్ధొచ్చింది.
Comments
Post a Comment